Begin typing your search above and press return to search.

చిరుత పాప స్నానం తరువాత ఇలా.. స్టన్నింగ్!

By:  Tupaki Desk   |   5 Oct 2022 12:30 AM GMT
చిరుత పాప స్నానం తరువాత ఇలా.. స్టన్నింగ్!
X
కొంతమంది హీరోయిన్స్ బ్యాడ్ లక్ ఏమిటో గాని అదృష్టం వచ్చినట్లే వచ్చి ఒక్కసారిగా చేజారిపోతుంది. నేహా శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా చిరుతలో నటించిన ఈ బ్యూటీ అప్పట్లో చాలా అదృష్టవంతురాలు అని అందరూ అనుకున్నారు. అప్పట్లో వరుస బాక్సాఫీస్ సక్సెస్ లతో ట్రాక్ లో ఉన్న పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడం.. అలాగే మెగా పవర్ స్టార్ తొలి సినిమా కావడం.

ఇక మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఆ ప్రాజెక్టు నిర్మించడం ఇలా భారీ స్థాయిలోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ చిరుత సినిమా సక్సెస్ నేహా శర్మకు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే విధంగా అవకాశాలు అయితే ఇవ్వలేకపోయింది. ఇక ఆ తర్వాత కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ మళ్లీ ఈ బ్యూటీ ఆశతో పెద్ద హీరోలతో నటిస్తాను అని కొన్ని ప్రాజెక్టులను కూడా రిజెక్ట్ చేసింది.

దీంట్లో అదే పెద్ద మైనస్ గా మారిపోయింది. ఇక తర్వాత వరుణ్ తేజ్ కుర్రాడు సినిమాలో హైలైట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక తర్వాత హిందీలోకి షిఫ్ట్ అయినా నేహా శర్మ అక్కడే మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక అక్కడ కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

గ్లామర్ విషయంలో అయితే బ్యూటీ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్గా ఎద అందాలతో మరోసారి షాక్ ఇచ్చింది. కేవలం ఒక వైట్ బాత్ డ్రెస్ లో అమ్మడు అప్పుడే స్నానం చేసినట్లుగా కెమెరాకు స్టిల్ ఇచ్చింది.

ఇక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.. గ్లామర్ తోనే బ్యూటీ ఎక్కువగా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఆ రూట్లో మాత్రం బేబీకి పెద్దగా ఛాన్స్ లు అయితే రావడం లేదు. ప్రస్తుతం ఒక హిందీ ప్రాజెక్ట్ తో అయితే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.