రెడ్ హాట్ నేహా కిర్రెక్కించిందే

Sun Aug 18 2019 16:04:11 GMT+0530 (IST)

Neha Sharma Stuns in Red

ఎరుపులో ముగ్ధమందారాన్ని తలపిస్తున్న ఈ అమ్మడు ఎవరు? అంటారా..! రెడ్ హాట్ నేహాశర్మను గుర్తు పట్టలేదా?  ఏయ్ బాబూ.. ఇలారా .. పేరేంటయ్యా? అని `చిరుత`నయుడు రామ్ చరణ్ ని అడిగిన ఈ హెడ్ వెయిట్ బ్యూటీని మర్చిపోతే ఎలా?చిరుత రిలీజ్ టైమ్ లో చరణ్ కంటే ఎక్కువగా నేహా గురించే మాట్లాడుకున్నారు యూత్. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్ తో యూత్ గుండెల్లో జోరీగలా దూరింది. కానీ ఎందుకనో ఆ తర్వాత టాలీవుడ్ కెరీర్ గురించి నేహా పాకులాట కనిపించలేదు. కుర్రాడు అనే వేరొక సినిమాలో నటించినా పెద్దంతగా పట్టించుకోలేదు. అలా తెలుగు ప్రేక్షకులకు దూరమైంది.

ప్రస్తుతం వరుస ఫోటోషూట్లతో వేడి పెంచుతూ బాలీవుడ్  ఫిలింమేకర్స్ కి టచ్ లో ఉంది. సామాజిక మాధ్యమాల్ని తెలివిగా పబ్లిసిటీకి ఉపయోగిస్తూ అవకాశాల్ని ఒడిసిపట్టుకుంటోంది. అప్పట్లో వరుసగా హాట్ బికినీ ఫోటోషూట్లతో విరుచుకుపడింది. స్త్రీ మూవీ ప్రీమియర్ వద్ద అంతే వేడెక్కించింది. అమ్మడు ఎక్కడ కనిపించినా ముంబై మీడియా మ్యాడమ్ మ్యాడమ్ ప్లీజ్ ! అంటూ వెంటపడుతుంటుంది. తాజాగా నేహా రెడ్ హాట్ లుక్ లో మరోసారి అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదు. ప్రస్తతం ఈ ఫోటో యూత్ లో వైరల్ గా మారింది. ప్రస్తుతం `హేరాఫేరి 3` అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తోంది. ఈ సినిమా 2020లో రిలీజ్ కానుంది.