కంబ్యాక్ అయ్యాక రెట్టింపు చెలరేగుతోంది

Mon Aug 03 2020 15:00:44 GMT+0530 (IST)

Neha Sharma Stunning Pose In White

గత కొంతకాలంగా వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది నేహాశర్మ. సోషల్ మీడియాల్లో నిరంతరం లేటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. వాణిజ్య ప్రకటనల ప్రచారంతోనూ బాగానే ఆర్జిస్తోంది. ఉన్నట్టుండి ఇంత స్పీడ్ ఎలా వచ్చింది? అంటే.. 2019లో ఈ అమ్మడు దూకుడు మరింతగా పెంచడానికి కారణం ఉంది. ఆ ఏడాది వరుసగా భారీ సినిమాలకు సంతకాలు చేయడమే ఇందుకు కారణం. ప్రస్తుతం శర్మా గాళ్ `హేరా ఫేరి 3` అనే భారీ సీక్వెల్ చిత్రంలో నటిస్తోంది. అక్షయ్ కుమార్- పరేష్ రావల్- సునీల్ శెట్టి లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫిరోజ్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఇది రిలీజైతే నేహా కంబ్యాక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవే గాక పలు వెబ్ సిరీస్ లు .. వీడియో సాంగ్స్ కి సంతకాలు చేసింది.నిజానికి సూపర్ మోడల్ గా రాణించిన నేహాశర్మ చిరుత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత అనూహ్యంగా టాలీవుడ్ వదిలేయడమే ఈ అమ్మడికి పెద్ద మైనస్ అయ్యిందని విశ్లేషిస్తారు. బాలీవుడ్ కలలతో ముంబై పరిశ్రమకే అంకితమవ్వడంతో ఇక్కడ పెద్ద స్టార్ అయ్యే అవకాశం మిస్ చేసుకుంది. అలాగని బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యిందా? అంటే అక్కడా అంతంత మాత్రమే. ఇప్పటికీ కెరీర్ గురించి పోరాడుతూనే ఉంది ఈ శర్మా గాళ్. ఇక గత ఏడాది కాలంగా నేహాశర్మ బోల్డ్ ఫోటోషూట్లు అంతర్జాలంలో మమంట పెడుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం కోవిడ్ విలయం తగ్గితే నేహా నటించిన భారీ చిత్రం రిలీజైపోతుంది. ఈలోగానే ఇదిగో ఈ అమ్మడు ఇలా కొత్త ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. స్టన్నింగ్ కిల్లింగ్ అనిపించే స్పెషల్ లుక్ లో ఎలా ఫోజిచ్చిందో చూశారు కదా?   వైట్ ఇన్నర్.. ఆ పైనా వైట్ టాప్.. కాంబినేషన్ బ్లూ డెనిమ్ షార్ట్.. చూడగానే కిర్రెక్కిపోతోంది యూత్. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. నేహాశర్మ నటించిన దిల్ కో కరార్ ఆయా వీడియో సాంగ్ తాజాగా రిలీజైంది. యూట్యూబ్ లో దేశీ మ్యూజిక్ ఫ్యాక్టరీలో ఈ రొమాంటిక్ గీతం అందుబాటులో ఉంది.