బికినీ సఖికి మ్యాగ్జిమమ్ థాంక్స్

Fri Aug 10 2018 12:01:10 GMT+0530 (IST)

Neha Sharma Photo shoot for Maxim

బికినీలో బంతాట అంటే అంత వీజీనా? అందుకోసం చాలానే కసరత్తులు చేయాలి. జిమ్ముకెళ్లాలి. గంటల కొద్దీ శ్రమించాలి. ఆహారంలో రూల్స్ పాటించాలి. ఇన్ని చేసినా దానిని చివరాఖరువరకూ కంటిన్యూ చేయాలి. సుశిక్షితుడైన కోచ్ ఓవైపు షంటేస్తుంటేనే ఇదంతా సాధ్యం. ఇంతగా శ్రమిస్తున్నారు కాబట్టే కథానాయికలు 60 ప్లస్ లోనూ అవే ఒంపుసొంపుల వయ్యారాలతో వడ్డనలు చేయగలుగుతున్నారు.60లలో భామలే అంత మెయింటెయిన్ చేస్తుంటే - 20లో - 30లో భామలు ఇంకెంతో మెయింటెయిన్ చేయాలి? అందుకేనేమో నేహాశర్మ ఎంతో స్ట్రిక్టుగా అన్నిటినీ మెయింటెయిన్ చేస్తూ అదిరిపోయే మేకోవర్ తో మ్యాగ్జిమ్ వాళ్లను అదరగొట్టేసింది. ఒకే ఒక్క ఫోటోషూట్ తో ప్రపంచాన్ని తనవైపు తిప్పేసుకుంది. గూగుల్ ఆనైతే చాలు.. అక్కడ నేహా శర్మ బికినీ ఫోటోలు తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితి. రోజు  రోజుకు నేహా మ్యాగ్జిమ్ కవర్ షూట్ కి సంబంధించిన గనిలోంచి తవ్వే కొద్దీ ఒక్కో ఫోటో బయటకు వస్తూ అంతకంతకు వేడి పెంచేస్తున్నాయి.

తాజాగా తన ప్రయత్నానికి దక్కిన ఫలితానికి ఉబ్బితబ్బిబ్బయిన నేహా శర్మ తన మేకప్ మేన్ - డిజైనర్ సహా మ్యాగ్జిమ్ నిర్వాహకులకు థాంక్స్ చెప్పింది. దానికి అంతే మొహమాటంగా మ్యాగ్జిమ్ వాళ్లు రిప్లయ్ ఇచ్చారు. ``దానిదేముందిలే  ఎన్నో కఠిన నియమాలు పాటించి ఒంపూ సొంపూ రంగరించిన ఘనత మీదే`` అంటూ తెగ పొగిడేశారు. మొత్తానికి నేహా వల్ల మ్యాగ్జిమ్ - మ్యాగ్జిమ్ వల్ల నేహా లాభపడ్డారు. ఆ ఫోటోలు వీక్షించిన వాళ్లంతా భేజారెత్తి పనీపాటా లేనివాళ్లయిపోయారంతే!! ప్చ్!!