నేహాశర్మ బోల్డ్ అవతార్ దుమారం

Tue Jan 25 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Neha Sharma Latest Photo

సరిగ్గా రెండేళ్ల క్రితం దీపావళి రోజున సీకే బ్రాండ్ కి ప్రమోషన్ స్టార్ట్ చేసింది దిశా పటానీ. ఒకే ఒక్క ఫోటోతో వరల్డ్ ని షేక్ చేసింది. ఆ తర్వాత సీకే బ్రాండ్ ప్రచారకర్తగా కోట్లు వెనకేసుకుంది.  ఆ తర్వాత తనని అనుసరించేందుకు ఇతర నాయికలు పోటీపడ్డారు. ప్రగ్యా జైశ్వాల్ సహా ఎందరో నాయికలు ఇదే  రూట్ లో వెళ్లారు.ఇప్పుడు అదే బాటలో శర్మా గాళ్ నేహాశర్మ పోటీపడుతోంది. తాజాగా నేహాశర్మ షేర్ చేసిన హాట్ లింగరీ ఫోటోషూట్ వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ టూపీస్ లో నేహాశర్మ బోల్డ్ అవతార్ దుమారం రేపుతోంది. అలా వైట్ పీస్ లను కవర్ చేసేందుకు పైన పింక్ కోట్ ని ధరించింది.

ఇక ఈ ఫోటోషూట్ లో మరో ప్రత్యేకత ఉంది. నేహా మెడలో లాకెట్ .. అక్కడి నుంచి నాభి దిగువ వరకూ విస్తరించిన గోల్డ్ లైన్ ని గమనిస్తే.. డిజైనర్ లుక్ సంథింగ్ హాట్ అని పొగిడేయకుండా ఉండలేం. చూస్తుంటే సీకే బ్రాండ్ ని కొట్టేలా ఉంది. ఇంతకీ ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం నేహా డీల్ ఎంతకు కుదుర్చుకుందో అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. చిరుత చిత్రంతో కథానాయికగా తెలుగులో ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇక్కడ తిరిగి నటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తోంది.

నేహాశర్మ హేరాఫేరీ 3 చిత్రంలో నటిస్తోంది. మహమ్మారీ వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఇంతకుముందు తానాజీ 3డి లాంటి బ్లాక్ బస్టర్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంది. జోగిరా సారా రారా అనే చిత్రంలో నవాజుద్దీన్ సరసన నేహా నటిస్తోంది. అలాగే తదుపరి పలు వెబ్ సిరీస్ లలోనూ నటించనుంది.