Begin typing your search above and press return to search.

ఆ విర‌హ‌మే శ‌ర్మా గాళ్ లో ఉన్న ప్ర‌త్యేక‌త‌

By:  Tupaki Desk   |   11 Jun 2021 4:30 AM GMT
ఆ విర‌హ‌మే శ‌ర్మా గాళ్ లో ఉన్న ప్ర‌త్యేక‌త‌
X
రెండు ద‌శాబ్ధాల క్రితం రిలీజైంది చిరుత మూవీ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇంకా గుర్తుంది నేహాశ‌ర్మ‌. ఏయ్ బాబూ ఇటు రా! అంటూ త‌న బాడీ గార్డ్ రామ్ చ‌ర‌ణ్ ని కొంటెగా గ‌ర్వంగా పిలిచే పెద్దింటి అమ్మాయిగా నేహా శ‌ర్మ న‌ట‌న నిజంగానే మెగాభిమానుల‌కు కిక్కిచ్చింది.

చిరుత త‌ర్వాత కూడా నేహా తెలుగులో న‌టిస్తుంద‌నుకున్నా కానీ వ‌రుణ్ సందేశ్ స‌ర‌స‌న ఓ చిన్న సినిమా చేశాక‌ ఆ త‌ర్వాత‌ అడ్రెస్ గ‌ల్లంత‌య్యింది. కొన్నాళ్ల పాటు నేహాశ‌ర్మ క‌నిపించ‌క‌పోయే స‌రికి త‌నతో నిండా ప్రేమ‌లో ప‌డిపోయిన రామ్ చ‌ర‌ణే ఇక నేహాను న‌టించ‌కుండా దాచేశాడ‌ని ప్ర‌చారం కూడా సాగిపోయింది. కానీ అవేవీ నిజాలు కాద‌ని త‌న‌కు హిందీ ప‌రిశ్ర‌మ‌లో న‌టించే ఉద్ధేశంతో తిరిగి ఇటు చూడ‌లేద‌ని కూడా వెల్ల‌డైంది.

ఏదేమైనా అదంతా గ‌తం.. వ‌ర్త‌మానంలో నేహాశ‌ర్మ హిందీ చిత్ర‌సీమ‌లో వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాలు అందుకుంటోంది. ప్ర‌స్తుతం హేరాఫేరి 3లో న‌టిస్తోంది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఇంత‌కుముందు తానాజీ 3డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. జోగిరా సారా రారా అనే చిత్రంలో న‌వాజుద్దీన్ స‌ర‌స‌న నేహా న‌టిస్తోంది. అలాగే త‌దుప‌రి ప‌లు వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టించేందుకు నేహా స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తెలిసింది.

నేహాశ‌ర్మ రెగ్యుల‌ర్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో హీట్ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బ్లాక్ ఇన్న‌ర్ పై బ్లూ డెనిమ్ ష‌ర్ట్ ధ‌రించి సంథింగ్ హాట్ గా క‌నిపిస్తున్న ఫోటోని నేహా శ‌ర్మ షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.