Begin typing your search above and press return to search.

హంగేరియన్ మూవీలో రాంచరణ్ భామ..భారీ ఆఫర్ కొట్టేసిందిగా..!!

By:  Tupaki Desk   |   3 July 2020 5:30 PM GMT
హంగేరియన్ మూవీలో రాంచరణ్ భామ..భారీ ఆఫర్ కొట్టేసిందిగా..!!
X
మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్ హీరోగా పరిచయమైన ఫస్ట్ సినిమా చిరుత. అదే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నేహా శర్మ. మొదటి సినిమాలోనే తన అందాలతో ఆకట్టుకున్న ఈ భామ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కెరీర్ ఫస్ట్ నుండి కూడా అమ్మడికి ఆఫర్లు తక్కువే. చిరుత సినిమా తరువాత తెలుగులో వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు అనే సినిమా చేసింది. ఆ సినిమా ఫలితం నిరాశ పరచడంతో మరో ఆలోచన లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ కూడా వరుస అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో అడపదడపా సినిమాలు చేస్తోంది. అయితే సినిమా సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో నేహా శర్మ ఓ రేంజ్ లో ఉపేస్తోంది. ఎప్పుటికప్పుడు అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సోషల్‌ మీడియాను హీటెక్కిస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈ భామ వెండితెర మీద కనిపించి రెండేళ్లు అవుతోంది. 2017లో రిలీజ్‌ అయిన మలయాళ సినిమా సోలోలో ఓ కీలక పాత్ర పోషించింది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు బిజో నంబియార్ దర్శకుడు. మళ్లీ రెండేళ్ల తరువాత మరోసారి అదే దర్శకుడితో సినిమా చేస్తోంది నేహా శర్మ. బిజో నంబియార్‌ బాలీవుడ్‌ లో స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్‌ చేస్తున్న తైష్‌ సినిమాలో నటిస్తోంది. ఇక తాజాగా అమ్మడు ఓ హంగేరియన్ మూవీ రీమేక్ లో లీడ్ రోల్ ఛాన్స్ కొట్టేసింది. జీ స్టూడియోస్ సమర్పించనున్న ఈ హంగేరియన్ సినిమాను డైరెక్టర్ ఇంద్రజిత్ నట్టోజి తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా జీ5 ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందట. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం. చూస్తుంటే నేహా కెరీర్ మలుపు తిరుగుతుందేమో అంటున్నాయి సినీవర్గాలు.