ఫొటోస్టోరీ: చిరుత భామ విన్యాసం అదుర్స్

Thu Jul 12 2018 16:12:19 GMT+0530 (IST)

Neha Sharma Fitness Pose

నవతరం కథానాయికలు ఫ్యాషన్ పరంగానే కాదు... ఫిట్ నెస్ విషయంలో పక్కాగా ఉంటున్నారు.  చెప్పాలంటే వాళ్లు హీరోల్ని మించిపోతున్నారు. గంటల తరబడి జిమ్ముల్లో గడపడం - క్రమం తప్పకుండా యోగా చేయడం వంటి అలవాట్లతో తమ దేహాన్ని నిత్యం యవ్వనంగా ఉంచుకుంటున్నారు. అందుకే కథానాయికలు ఇదివరకటిలా ఆరేడేళ్లకి మాయమైపోకుండా పది పదిహేనేళ్లయినా చెక్కు చెదరని అందంతో తెరపై కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఆ జాబితాలో నేహాశర్మ కూడా చేరుతుంది. రామ్ చరణ్ నటించిన `చిరుత` విడుదలై పదకొండేళ్లకి పైనే అయ్యింది. కానీ అందులో నటించిన కథానాయిక నేహాశర్మ మాత్రం ఇప్పటికీ అంతే అందంతో కనిపిస్తోంది.అందుకు కారణం ఇదిగో.. ఇలాంటి విన్యాసాలే! ఈమె యోగాలో ఆరితేరింది. అందుకే ఎప్పుడూ ఫిట్ గా ఉంటుంది. తాజాగా ఈమె విన్యాసాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. దేహాన్ని తలకిందులు చేసి.. కాళ్లని ఎడం చేసి నిటారుగా పోజు పెట్టింది. ఎంతో ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇలాంటి విన్యాసాలు సాధ్యం కావని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద నేహాశర్మ ఫిట్‌నెస్ లో ఆరితేరిందనే చెప్పాలి.