బిగ్ బాస్ 6 : మూడవ వారం ఎలిమినేషన్ లీక్

Sun Sep 25 2022 10:11:44 GMT+0530 (India Standard Time)

Neha Chowdary Out From Biggboss 6

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 మూడవ వారం ముగిసింది. మొదటి వారంలో ట్విస్ట్ ఇచ్చి అందరిని సేవ్ చేసిన నాగార్జున రెండవ వారంలో డబుల్ ఎలిమినేషన్ తో షాని మరియు అభినయ శ్రీ ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక మూడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే ఆసక్తి నెలకొంది. నామినేట్ అయిన వారిలో కాస్త వీక్ గా నేహా చౌదరి ఉందంటూ అభిప్రాయం వ్యక్తం అయ్యింది.కొందరు ఊహించినట్లుగానే నేటి ఎపిసోడ్ లో నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వబోతుంది. శనివారం రోజే షూట్ చేయడంతో ఎప్పటిలాగే ఆ విషయం బయటకు వచ్చేసింది. నేహా చౌదరికి స్టార్ మా కి సంబంధాలు ఉన్నాయి. ఆమె అందులోని యాంకర్ గా వ్యవహరిస్తుంది. కనుక ఆమె ఎలిమినేషన్ ఇంత త్వరగా ఉండక పోవచ్చు అని చాలా మంది నమ్మారు.

కానీ ఓట్ల ద్వారానే బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు అంటూ మరోసారి స్టార్ మా మరియు షో నిర్వాహకులు చెప్పకనే చెప్పారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 యొక్క మూడవ వారం ఎలిమినేషన్ లీక్ అవ్వడంతో ప్రేక్షకులు ఎప్పటిలాగే ఎపిసోడ్ పై పెద్దగా ఉత్కంఠతతో లేరు. బిగ్ బాస్ సీజన్ 6 లో నేహా ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలా నమ్మకం కలిగింది.

కానీ ఆమె ఆట విషయంలో ఆకట్టుకోలేక పోయింది. ఇలాంటి కంటెస్టెంట్స్ హౌస్ లో అవసరం లేదు అనే విధంగా విమర్శలు దక్కించుకుంది. అందుకే ఆమెకు ఇంత త్వరగా బయటకు వచ్చేందుకు గేట్లు ఓపెన్ అయ్యాయి అంటూ కొందరు బిగ్ బాస్ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నేహా ఎలిమినేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.