లైంగికదాడులు నాకు కొత్తకాదు.. ఒకడైతే గుడిలోనే.. గాయని సంచలన ఆరోపణలు

Sat Nov 21 2020 15:20:53 GMT+0530 (IST)

Assaults are not new to me .. one is in the temple .. the singer is accused of sensationalism

బాలీవుడ్ గాయని నేహా భాసిన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అనేకసార్లు లైంగికదాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. తన జీవితంలో ఎదురైన అనేక చేదు అనుభవాలను వివరించారు..ఆమె ఏం చెప్పారంటే.. ‘ లైంగిక వేధింపులు నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచే నేను ఇటువంటి ఎదర్కొన్నాను. పదేళ్ల వయసులో ఓ సారి హరిద్వార్ వెళ్లాను. అక్కడ ఓ అబ్బాయి .. నా మర్మాంగంలో తన వేలిని గుచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయా.

కొన్నేళ్ల తర్వాత మళ్లీ హరిద్వార్ టెంపుల్ లోనే ఓ యువకుడు వచ్చి నా బ్రెస్ట్ను గట్టిగా పట్టుకున్నాడు. ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. నా తప్పు ఏమి లేకుండానే నా జీవితంలో ఇటువంటి ఘటనలు ఎదురయ్యాయి. ’ అని నేహా చెప్పారు. ‘ ఇప్పటికీ కొందరు నన్ను సోషల్మీడియాలో వేధిస్తున్నారు. నాకు అసభ్యకరంగా మెసేజ్లు పెడుతుంటారు. కొందరైతే కామెంట్లు పెడతారు. నా ఒంటి గురించి డ్రెస్సుల గురించి తప్పుడు రాతలు రాస్తారు. వారిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తా. సోషల్ మీడియాలో నాకు ఇటీవల బెదిరింపులు వచ్చాయి. కొందరు చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ' అని చెప్పారు.

నేహా తెలుగులోనూ కొన్ని పాటలు పాడారు.
కరెంట్ చిత్రంలో ‘అటు నువ్వే.. ఇటు నువ్వే’ దడ చిత్రంలో ‘హల్లో హల్లో’ ఊసరవెళ్లిలో ‘నిహారిక నిహారిక’ నువ్వా నేనా చిత్రంలో.. థ థ తమారా నేనొక్కడినే చిత్రంలో ఆవ్ తుజో మోగ్ కార్టా జనత గ్యారేజ్లో యాపిల్ బ్యూటీ జై లవకుశలో స్వింగ్ జరా పాటను పాడారు. ఆ పాటలు తెలుగులో హిట్ అయ్యాయి.