Begin typing your search above and press return to search.

పాత ఫార్ములాతో ఉప్పీ సాహసం

By:  Tupaki Desk   |   11 Jun 2019 4:55 AM GMT
పాత ఫార్ములాతో ఉప్పీ సాహసం
X
సరిగ్గా 21 ఏళ్ళ క్రితం ఉపేంద్ర తీసిన A మూవీ ఒక సెన్సేషన్. ప్రేమలోని విభిన్న కోణాన్ని నాటుగా ఘాటుగా ప్రశ్నించిన తీరుకు కన్నడతో పాటు తెలుగులోనూ దానికి బ్రహ్మరధం పట్టారు. ఇదే స్టైల్ లో వచ్చిన ఉపేంద్ర కూడా సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ ట్రెండ్ కొన్నాళ్ల పాటు సాగి అతనికి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. మొహం మీద కొట్టినట్టు ఉండే ఉపేంద్ర హీరోల శైలి భారీగా ఫాన్ బేస్ ని ఇచ్చింది. అదంతా గతం.

ఇప్పుడు ప్రేక్షకులతో పాటు యూత్ అభిరుచులు మారాయి. అయినా ఉపేంద్ర మాత్రం తన పాత పద్ధతిలోనే ఏదో కొత్తగా ట్రై చేసినట్టు చెబుతున్న ఐ లవ్ యు ఈ నెల 14న విడుదల కానుంది. కనీస స్థాయిలో కూడా బజ్ లేదు. మొన్న వైజాగ్ లో ప్రీ రిలీజ్ చేశారు కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు ఐ లవ్ యు ఇప్పటి ప్రేమికుల ధోరణులను ప్రశ్నించే విధంగా తీసినట్టుగా ఉపేంద్ర చెబుతున్నాడు. పైగా మంచి సందేశం కూడా ఉంటుందట.

కానీ ట్రైలర్ చూస్తే అలాంటి ఫీలింగ్ ఏదీ కలగలేదు. పైగా సన్ అఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు చూసాక ఉపేంద్ర మనవాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బాగా కనెక్ట్ అయ్యాడు. తర్వాత ఏ తెలుగు మూవీ చేయనప్పటికీ అది అలా ప్రింట్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు తనని సోలో హీరోగా చూడటం అందులోనూ ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుందా అనే సందేహాలు ఉన్న ఫార్ములాతో రావడం చాలా అనుమానాలు రేకేత్తిస్తోంది. పైగా చిన్న సినిమాల భారీ పోటీ మధ్య విడుదల అవుతున్న ఐ లవ్ యు టైటిల్ నుంచి ప్రమోషన్ దాకా చాలా డల్ గా ఉంది. మరి ఉప్పీ ఈ సవాల్ ని ఎలా ఎదురుకుంటాడో