అమ్మడికి స్టార్ డమ్ తో పాటు నెగిటివిటీ కూడా పెరిగిపోతోందిగా..!

Tue Sep 21 2021 13:08:32 GMT+0530 (IST)

Negativity On Pooja hegde stardom

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉన్న ముద్దుగుమ్మల్లో పూజా హెగ్డే కూడా ఒకరు. 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ.. 'డీజే-దువ్వాడ జగన్నాథం' చిత్రంతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత 'మహర్షి' 'అల వైకుంఠపురంలో' వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్స్ రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో మూడు - తమిళ్ లో ఒకటి - హిందీలో రెండు సినిమాలతో ఈ బుట్టబొమ్మ బిజీగా గడుపుతోంది. అయితే ఉన్నట్టుండి పూజాహెగ్డే మీద ఇండస్ట్రీలో నెగెటివీ రావడం మొదలైంది.తెలుగులో పూజా మీద ఒక్కసారిగా ఇంత నెగిటివిటీ పెరగడానికి కారణం.. ఆమె కారణంగా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడమే అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. పారితోషికం మాట అటుంచితే పూజా కారణంగా ప్రొడక్షన్ కాస్ట్ బాగా ఎక్కువైపోతోందని చాలా మంది నిర్మాతల నుంచి కంప్లైంట్ వస్తోందట. పూజా సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్ చాలా ఖరీదైనవి సెలక్ట్ చేస్తుందట. అలానే తనతో పాటుగా ఎక్కువ మంది వ్యక్తిగత సిబ్బందిని తీసుకొస్తోందట. దీంతో నిర్మాతలకి తడిసి మోపిడవుతోందని.. చాలా వరకు ఇలానే బడ్జెట్ ఎక్కువైపోతుందని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి పూజా హెగ్డేకి స్టార్ డమ్ తో పాటుగా నెగిటివిటీ కూడా పెరిగిందన్నది వాస్తవం. అంతేకాదు ఒకే డైరెక్టర్ తో ఎక్కువ సినిమాలు చేస్తుండటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టఫ్ గా మారింది. అయితే ఈ బ్యూటీ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా.. ఆఫర్స్ కి మాత్రం కొదువలేకపోవడం గమనార్హం. పూజా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో కలిసి 'రాధే శ్యామ్'.. అఖిల్ అక్కినేనికి జోడీగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసింది.

ఇటీవల మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న SSMB28 ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజాహెగ్డే ను ఫైనలైజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోలీవుడ్ - బాలీవుడ్ లోనూ బుట్టబొమ్మ అవకాశాలు అందుకుంటోంది. తమిళ్ హీరో విజయ్ తో కలిసి 'బీస్ట్' అనే సినిమా చేస్తోంది పూజా. అలానే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ - డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో 'సర్కస్' అనే హిందీ సినిమా చేస్తోంది. దీంతో పాటుగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే ఓ సినిమాలో నటిస్తోంది.