Begin typing your search above and press return to search.

గొడుగు ప‌ట్టేందుకు ఒక‌డు కావాలా? కియ‌రాకి చీవాట్లు!

By:  Tupaki Desk   |   17 Aug 2022 3:30 AM GMT
గొడుగు ప‌ట్టేందుకు ఒక‌డు కావాలా? కియ‌రాకి చీవాట్లు!
X
``చ‌క్క‌న‌మ్మ‌ల‌కు గొడుగు ప‌ట్టేందుకు వెంట‌ ఎప్పుడూ ఒక‌డు కావాలా? గార్డ్ కానీ డ్రైవ‌ర్ కానీ త‌మ‌తో లేక‌పోతే కుద‌ర‌దా? అయినా మీ చేతుల‌కు ఏమైంది?`` ఇదీ ప్ర‌తిసారీ నెటిజ‌నుల ప్ర‌శ్న‌. అందాల ముద్దుగుమ్మ‌లు షూటింగ్ కి వెళ్లినా మార్కెట్ కి వెళ్లినా లేదా ఆరుబ‌య‌ట షికార్ కి వెళ్లినా వెంట వ‌చ్చే సెక్యూరిటీ వాళ్లు కానీ డ్రైవ‌ర్ కానీ గొడుగు ప‌ట్టాలా? ఒక‌వేళ అనుచ‌రులు గొడుగు ప‌ట్ట‌క‌పోతే షికార్ ని ఆస్వాధించ‌లేరా? ప్ర‌తిసారీ నెటిజ‌నుల నింద‌లు ఇవి.

ఇంత‌కుముందు దిశా ప‌టానీ.. కరీనా క‌పూర్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు ఇలాంటి చీవాట్లు ఎదుర్కొన్నారు. ఓసారి ఒక 60 ఏళ్ల వృద్ధుడు అందాల దిశాప‌టానీ కి గొడుగు ప‌ట్ట‌గా తీవ్రంగా ట్రోలింగ్ కి గురైంది. ఆ త‌ర్వాతా అలాంటి ఘ‌ట‌న‌లు క‌థానాయిక‌ల విష‌యంలో రిపీట‌వుతూనే ఉన్నాయి.

ఇప్పుడు చీవాట్లు తిన్న నాయిక‌ల జాబితాలో కియ‌రా పేరు కూడా చేరింది. ప్ర‌స్తుతం ముంబైలో వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీనివ‌ల్ల త‌న‌కు గొడుగు ప‌ట్టేందుకు ఒక సెక్యూరిటీ గార్డ్ అవ‌స‌రం ప‌డింది. అలా కార్ నుంచి దిగి వెళుతుంటే చిట‌ప‌ట చినుకుల్లో త‌డ‌వ‌కుండా ఈ ముద్దుగుమ్మ‌కు గొడుగు ప‌ట్టాడు ఆ సెక్యూరిటీ గార్డ్. కానీ అలా గొడుగు పట్టుకోవడానికి అత‌డిని నియ‌మించినందుకు కియారా అద్వానీ దారుణంగా ట్రోలింగుకి గురైంది. ``ఇంత‌కీ మీ చేతులకు ఏమైంది?స‌త్తువ లేదా?`` అని నెటిజనులు ప్రశ్నించారు.

కియారా అద్వానీ షూటింగ్ కోసం ముంబై- జెట్టీ ప‌రిస‌రాల‌కు వెళుతూ కార్ లోంచి దిగి వెళుతోంది. వర్షాకాలం కావడంతో ప్రతి ఒక్కరికీ గొడుగు త‌ప్ప‌నిస‌రి అవుతోంది. బాలీవుడ్ నటీమణులు తరచుగా తమ కోసం గొడుగులు పట్టుకునేందుకు సెక్యూరిటీ ని వెంట తీసుకుని వెళుతుంటారు. త‌మ‌ వ్యక్తిగత సిబ్బందిని అందుకు నియోగిస్తుంటారు. పైగా బోయ్స్ ని దీనికోసం వెంట తిప్ప‌డం మాన‌రు. ఈ వ్య‌వ‌హారం ప్ర‌తిసారీ విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఇప్పుడు సెక్యూరిటీ గార్డు కియ‌రాకు గొడుగు పట్టాడు. దీంతో ఘోరంగా ట్రోలింగుకి గురైంది.

జగ్ జగ్ జీయో నటి ఇలా చేయడం స‌రికాదంటూ కొంద‌రు దుమ్మెత్తి పోస్తున్నారు. కియ‌రా విశేషాధికారాన్ని దుర్వినియోగం చేస్తోంద‌ని కూడా నిల‌దీస్తున్నారు. ఒక నెటిజ‌నుడు వ్యాఖ్యానిస్తూ..``కియ‌రా తన గొడుగును ఎందుకు పట్టుకోలేదో నాకు అర్థం కాలేదు.. అది చాలా తేలికగా ఉంటుంది`` అని వ్యాఖ్యానించ‌గా.. మరొక వినియోగదారు ఇలా రాసాడు. ``ఆమె చేతులకు స‌త్తువ‌ లేదు.. అందుకే గొడుగును పట్టుకోలేకపోయింది`` అని కామెంట్ చేసాడు. ఇక త‌న‌ను వ‌ర్షంలో ఓ చోట విడిచిపెట్టేయ‌డంతో కియారా గార్డ్ పై అసంతృప్తిగా కనిపించింది.

ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఆస‌క్తిక‌రంగా షూటింగ్ కోసం చిట్టి పొట్టి డెనిమ్ నిక్క‌రులో కియ‌రా ప్ర‌త్య‌క్ష‌మైన తీరు యూత్ కి వేడెక్కించింది. మ‌రీ అంత పొట్టి నిక్క‌రు ఎక్క‌డ దొరికిందో అంటూ నెటిజ‌నం సందేహం వ్య‌క్తం చేసారు. కియ‌రా ప్ర‌స్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇటు సౌత్ అటు నార్త్ ని ఏల్తోంది. బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌కు క‌మిట‌వుతోంది. ప్రాజెక్ట్ ల విష‌యానికి వ‌స్తే.. త‌దుప‌రి గోవింద నామ్ మేరా సెట్స్ లో ఉంది. ఇందులో ఆమె విక్కీ కౌశల్ తో కలిసి స్క్రీన్ ను పంచుకుంటోంది. అలాగే శంకర్- రామ్ చరణ్ ల‌తో RC15 కూడా చిత్రీక‌ర‌ణ‌లో ఉంది.