ఫొటోటాక్ : అమ్మ బర్త్ డే కు ప్రియుడితో నయన్

Thu Sep 16 2021 16:00:01 GMT+0530 (IST)

Nayanthara with her Mother

లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నాళ్లుగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం అందరికి తెల్సిందే. వీరిద్దరు కూడా ప్రేమ లోకంలో మునిగి తేలుతున్నారు. మొదట్లో వీరు తమ ప్రేమ గురించి బయట చెప్పందుకు ఇష్టపడలేదు. బయటకు కనిపించేందుకు కూడా ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉంటున్నారు. ప్రతి సందర్బంను కూడా చాలా జోవియల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా నయనతార అమ్మగారి పుట్టిన రోజును వైభవంగా సెలబ్రేట్ చేయడం జరిగింది.కేరళలో ఉండే నయనతార అమ్మ పుట్టిన రోజు నేపథ్యంలో వేడుక నిర్వహించారు. చెన్నై నుండి విఘ్నేష్ శివన్ మరియు నయనతారలు కలిసి కేరళ వెళ్లారు. అక్కడ సరదాగా అమ్మ బర్త్ డే వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఫొటోలను చూస్తుంటే విఘ్నేష్ శివన్  నయన్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయ్యాడని.. వారి ఫ్యామిలీలో ఒకడిగా కలిసి పోయాడు అనిపిస్తుంది. ఆంటీ బర్త్ డే సందర్బంగా విఘ్నేష్ శివన్ ప్రత్యేకంగా బహుమానాలు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా సోషల్ మీడియా పోస్ట్ కూడా షేర్ చేయడం జరిగింది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వీరిద్దరు ప్రతి సందర్బంను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి సందర్బాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నందుకు విఘ్నేష్ శివన్ పై నయనతార ప్రేమ మరింత పెరుగుతున్నట్లుగా ఆమె మొహంలో ఆనందం మరియు ఉత్సాహం కనిపిస్తుంది. ప్రస్తుతం చెన్నైలో ఇద్దరు సహజీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే ఎంగేజ్డ్ అయిన వీరిద్దరు త్వరలోనే పెళ్లి కి సిద్దం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయన్ ఒక సినిమాను చేస్తోంది. అందులో విజయ్ సేతుపతి మరియు సమంతలు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న చిరంజీవి గాడ్ ఫాదర్ లో కూడా నయన్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో నయన్ మరియు విఘ్నేష్ శివన్ లు కలిసి నిర్మాణ సంస్థ ప్రారంభించి వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు.