'సైరా' ను నయనాకర్షణ గట్టెక్కిస్తుందా?

Tue Sep 17 2019 10:41:34 GMT+0530 (IST)

Nayanthara on about Sye Raa Movie Promotions

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన `సైరా-నరసింహారెడ్డి` అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ - మేకింగ్ వీడియోతో వేడి పెంచారు. తదుపరి ట్రైలర్ - ప్రీరిలీజ్ వేడుకకు సమయం ఆసన్నమైంది. అయితే సైరా ఈవెంట్ వాయిదా పడిందన్న వార్త చిరు అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ క్రమంలోనే ట్రైలర్ ని డైరెక్టుగా చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా రిలీజ్ చేస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి.సైరా ట్రైలర్ పై తొలి రివ్యూ చెప్పిన దుబాయ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్రైలర్ లో చిరు పెర్ఫామెన్స్ పీక్స్ లో ఉందని పొగిడేశాడు. అలాగే సైరా క్లైమాక్స్ ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఇంత భారీ చిత్రానికి ప్రమోషన్ పరంగా ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? అన్న డైలెమా నెలకొంది ఫ్యాన్స్ లో.

`సాహో` లాంటి భారీ చిత్రానికి చివరి 20 రోజుల ప్రచారం గొప్పగా కలిసొచ్చింది. సినిమాలో కంటెంట్ లేకపోయినా పాన్ ఇండియా ప్రచారానికి తగ్గట్టే ఓపెనింగులు అదిరిపోయాయి. ఆ మ్యాజిక్ సైరాతో రిపీట్ చేయగలగరా లేదా?  పాన్ ఇండియా సినిమాకి తగ్గ ప్రచారం కనిపించడం లేదే అన్న ఆందోళన అభిమానుల్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం ఈ పది రోజులు అయినా పూర్తి స్థాయి ప్రచారం చేస్తే అది కలిసొస్తుందనే భావిస్తున్నారు. అందుకే కొణిదెల టీమ్ ఇప్పటికే మెట్రోల్లో బిగ్ రేంజు ప్రచారానికి ప్లాన్ చేసిందట. ముంబై -చెన్నయ్- బెంగళూరు- పూణే వంటి చోట్ల భారీ ఈవెంట్లను నిర్వహిస్తారట. అక్కడ మెట్రోల్లో నయన్ ప్రత్యేక ఆకర్షణగా బిగ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. మెట్రోల్లో నయనాకర్షణను క్యాష్ చేసుకోవాలన్నది చిత్రయూనిట్ ప్లాన్. అయితే నయన్ హైదరాబాద్ ఈవెంట్ కి దూరమా? అయితే ఎందుకని? అన్నది మాత్రం తెలియరాలేదు. చాలా కాలానికి ప్రమోషన్స్ కి రాను అన్న నియమాన్ని ఉల్లంఘించి నయన్ ఇలా సహకరించడం ఆసక్తిని కలిగిస్తోంది. నయన్ అంగీకరించడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి ఒప్పించినందు వల్లనేనని తెలుస్తోంది. ఈనెల 20 నుంచి పదిరోజులు ప్రమోషన్స్ పీక్స్ లో ప్లాన్ చేస్తున్నారట. ప్రమోషన్ షెడ్యూల్ ఏమిటన్నది కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ రివీల్ చేస్తుందేమో చూడాలి.