ఏది న్యాయమో లేఖతో లెక్క చెప్పేసిన నయన్

Sun Dec 08 2019 12:46:54 GMT+0530 (IST)

Nayanthara Responds on About Disha Case Accused Encounter

దిశ నిందితుల ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంగా కొత్త చర్చను తెర మీదకు తీసుకురావటమే కాదు.. బాధితులకు న్యాయం ఎంత త్వరగా అందాలన్న అవసరాన్ని చెప్పేలా చేసింది. ఎన్ కౌంటర్ పై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎప్పటిలానే కొన్ని మానవ హక్కుల సంఘాల వారు.. సామాజిక వేత్తలు (వామపక్ష భావజాలం) ఉన్నోళ్లు మాత్రం ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండించారు.లేటుగా స్పందించినా లేటెస్ట్ అన్న తరహాలో ప్రముఖ నటి నయనతార ఈ ఉదంతంపై రియాక్ట్ అయ్యారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తన వాదనను విస్పష్టంగా వ్యక్తం చేసింది. అమ్మాయిలకు జరిగే అన్యాయాలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

న్యాయం అన్నది వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలంటూ తనదైన శైలిలో పేర్కొన్నారు. ఒక అమాయకురాలిని అంత దారుణంగా చంపిన వాళ్లను అంతకంటే దారుణంగా చంపేసినా తప్పేం లేదని స్పష్టం చేశారు. సరైన సమయంలో సరైన న్యాయం చేసిన తెలంగాణ పోలీసులు నిజమైన హీరోలని.. వారికి తన సలాం అన్నారు. ఏ రైట్ యాక్ట్ ఆఫ్ హ్యుమానిటీ అంటూ రాసిన లేఖ సామాన్యులకు పిచ్చ పిచ్చగా నచ్చేయటం ఖాయం. కాకుంటే.. హక్కుల కార్యకర్తలు మాత్రం నయన్ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేసే వీలుందంటున్నారు. మరీ.. విషయం గురించి ఆలోచించిందా అమ్మడు?