Begin typing your search above and press return to search.

'సైరా'తో పాటు 'బిగిల్‌'కూ నయన్‌ బంపర్‌ ఆఫర్‌

By:  Tupaki Desk   |   18 Sep 2019 1:05 PM GMT
సైరాతో పాటు బిగిల్‌కూ నయన్‌ బంపర్‌ ఆఫర్‌
X
టాలీవుడ్‌.. కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార కెరీర్‌ ఆరంభం కూడా సినిమా ప్రమోషన్స్‌ కు దూరంగా ఉంటూ వస్తుంది. ఎంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించినా కూడా నయన్‌ మాత్రం ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ కు హాజరు అవ్వదు. అప్పట్లో బాలకృష్ణ తో నటించిన శ్రీరామరాజ్యం చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంది. మళ్లీ ఇప్పుడు చిరంజీవితో కలిసి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొనేందుకు ఒప్పుకుందట. సైరా చిత్రం ప్రమోషన్స్‌ లో పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్న నేపథ్యంలో నయన్‌ ను కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు ఒప్పించినట్లుగా తెలుస్తోంది.

సైరా చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొనేందుకు ఒప్పుకున్న నయనతార మరో సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొనేందుకు కూడా ఒప్పుకుంది. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా అట్లీ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బిగిల్‌' చిత్రంలో నయన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఆ చిత్రంను అక్టోబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు నయన్‌ ఒప్పుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రముఖ ఆన్‌ లైన్‌ మీడియా సంస్థ ఈ విషయాన్ని కన్ఫర్మ్‌ చేసి ప్రచురితం చేసింది. నయనతార పారితోషికం అధికంగా ఇచ్చినా కూడా ప్రమోషన్స్‌ కార్యక్రమాలకు హాజరు అయ్యేది కాదు. కాని మెల్ల మెల్లగా తన పద్దతిని మార్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఈ రెండు చిత్రాల తర్వాత రజినీకాంత్‌ తో నటిస్తున్న చిత్రం 'దర్బార్‌' ప్రమోషనల్‌ కార్యక్రమంకు కూడా నయన్‌ హాజరు అయ్యేనేమో చూడాలి.