నయన్ ని వెంటాడుతున్న గతం

Thu Dec 05 2019 19:02:20 GMT+0530 (IST)

Nayanthara On Her Break-Up With Prabhu Deva

అందాల నయనతార ప్రేమాయణాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ఆరంభంలో శింబుతో ప్రేమ... బ్రేకప్..  అటుపై కెరీర్ కీలక మలుపులో ప్రభుదేవాతో ప్రేమాయణం పెళ్లి వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. నయన్-ప్రభుదేవా మూడేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. ఏడడుగులు నడవడమే తరువాయి అనుకున్నారు. మీడియాలో ఈ జంటపై ఒకటే హైప్. కానీ అనూహ్యాంగా ప్రభుదేవా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అలా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధం అక్కడితో ముగిసింది. తర్వాత ఈ విషయంపై నయనతారకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. నయన్ నాటి నుంచి కొన్నాళ్ల పాటు కేవలం సినిమా షూటింగ్ లకే పరిమితమైంది. అప్పటి నుంచి  మీడియా ఇంటర్వూలకు గానీ.. సినిమా ప్రచారానికి కాని హాజరవ్వడం లేదు.ఆ తర్వాత యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో లవ్ లో పడింది. ప్రస్తుతం ఈ జంట పెళ్లి  కూడా చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే నయన్ మీడియాకు కొత్త విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో  భాగంగా ఓ ఇంటర్వూలో తన  రెండవ లవ్ స్టోరీ  గురించి.. ప్రభుదేవా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

ప్రభుదేవాతో విడిపోవడం నిజంగా జీవితం చిన్నాభిన్నామైనంత పనైందని వాపోయింది.  ఆ సమయంలో మనసు ముక్కలైందని.. ఏం చేయాలో తోచని స్థితిలో ఒంటరి గా మిగిలి కుమిలిపోయనని తెలిపింది. ఆ ఘటన జరిగి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని..  విఘ్నేష్ తో ఉన్నా ఆ జ్ఞాపకాలు మరువలేకపోతున్నానని భావోద్వేగానికి గురైంది.