కలెక్టర్ గా వచ్చి హిట్టు కొడుతుందా?

Thu Oct 19 2017 15:00:37 GMT+0530 (IST)

Nayanthara Karthavyam Movie

ప్రస్తుతం సౌత్ హీరోయిన్లలో అత్యంత సీనియర్ హీరోయిన్స్ లలో బ్యూటిఫుల్ గర్ల్ నాయన తార ఒకరు. అప్పుడెప్పుడో 2003వ సంవత్సరంలో  మలయాళం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన నయన ఏళ్లు గడుస్తున్నా ఇంకా తన స్టార్ హోదాను ఏ మాత్రం తగ్గించడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తోంది.అంతే కాకుండా ఎన్ని సార్లు లవ్ ఫెయిల్యూర్ అయినా ఎన్ని కాంట్రవర్సీలు తనపై చెలరేగినా అమ్మడు స్టార్ హీరోలతో ఛాన్సులను దక్కించుకుంటోంది. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని భాషల్లో నటించింది. అయితే ప్రస్తుతం చేతుల్లో సినిమాలు బాగానే ఉన్నా గత కొంత కాలంగా విజయాలు మాత్రం దక్కించుకోవడం లేదు. చివరగా అమ్మడు డోరా అనే థ్రిల్లర్ సినిమాతో వచ్చింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. తెలుగులో చివరగా నటించిన బాబు బంగారం సినిమా కూడా అపజయాన్నే ఇచ్చింది.

అయితే ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని ఆరాం అనే సినిమాను నవంబర్ 3 రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమా తెలుగులో కర్తవ్యం అనే పేరుతో రిలీజ్ అవుతోంది. సినిమాలో నయన కలెక్టర్ గా కనిపించనుందట సోషల్ డ్రామా తరహాలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అమ్మడు భారీ ఆశలనే పెట్టుకుంది. మరి ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.