నయన్ పై ఫైర్.. రొమాన్స్ లోనూ పవిత్రతను కాపాడు!

Mon Aug 15 2022 12:08:20 GMT+0530 (IST)

Nayanthara In Romantic Mood!

విఘ్నేష్ శివన్ తో నయన్ రొమాంటిక్ లైఫ్ అన్నివేళలా పబ్లిక్ కి ఓపెన్. ఈ జంట ఏదీ దాచుకోరు. ప్రతిదీ బహిరంగంగానే వెల్లడిస్తుంటారు.వారు సెలవులకు వెళ్లినప్పుడల్లా దర్శకుడు విఘ్నేష్ శివన్ తన గర్ల్ ఫ్రెండ్ కం వైఫ్ నయనతార ఫోటోలను షేర్ చేస్తుంటారు.ప్రతిసారీ ఆ ఫోటోలను సోషల్ మీడియాల్లో అందరితో పంచుకుంటున్నాడు. అయితే తాజా రొమాంటిక్ క్లిక్ లు అభిమానుల కోపాగ్నికి కారణమయ్యాయి.

నయనతార తన భర్తతో కలిసి రొమాంటిక్ డిన్నర్ కోసం బార్సిలోనాలో ఉన్నారు. అక్కడ బ్లాక్ ట్యాంక్ టాప్ తో ఎంతో రొమాంటిక్ లుక్ లో కనిపించారు. ఇక అంత హాట్ లుక్ లో కూడా నయన్ మెడలో పసుపుతాడు హైలైట్ అయ్యింది.

అలాంటి అరుదైన ఫోటోలను క్లిక్ చేసి అతడు షేర్ చేయడం అభిమానులకు నచ్చడం లేదు. వీటిలో నయనతార తన గ్లామర్ ను దాచుకోకుండా ప్రదర్శించింది. ఇందులో ఎంతో పవిత్రమైన పసుపు తాడును కూడా ప్రదర్శిస్తోంది. ఇది చాలా శృంగారభరితంగా టీజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

స్పెయిన్ లో ఈ జంట రొమాంటిక్ లైఫ్ ని మరీ ఇంతగా పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసం వెంపర్లాడాల్సిన పని ఏం ఉంది? అంటూ కొందరు చీవాట్లు పెడుతున్నారు.నయన్ -విఘ్నేష్ పగటిపూట నగరంలో తిరుగుతూ రాత్రికి చక్కటి తినుబండారాలను ఆస్వాధిస్తున్నారు.

స్పెయిన్ లో వెరైటీ లైఫ్ ని గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ షికార్లు మరింత పెరిగాయి. ఇక నయన్ ప్రస్తుతం షారూక్ సరసన అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాతు వాకుల రేండు కాదల్ తర్వాత విఘ్నేష్ శివన్ కొంత గ్యాప్ తీసుకున్నారు. తిరిగి అతడు తన తదుపరి సినిమాని తెరకెక్కించాల్సి ఉంటుంది.