సఖుడి ప్రేమకు నయన్ బుగ్గలు కందాయి

Wed May 25 2022 09:59:19 GMT+0530 (IST)

Nayanthara And Vignesh

చెలికాడు తన ప్రేయసి కోసం నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చి ప్రేమగా గోముగా దగ్గర కూచుని తినిపిస్తుంటే ఆ రొమాంటిక్ ఫీలింగే వేరు. ఇదిగో ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపించింది. అందాల నయనతార ప్రియసఖుడు అయిన విఘ్నేష్ శివన్ తన కోసం ఏకంగా నాన్ వెజ్ వెరైటీలను ఆర్డర్ చేసాడు.అంతేకాదు వాటిని ప్రేమగా ఇలా తన చెలికి తినిపిస్తున్నాడు. ఆ సమయంలో నయన్ ఎంతో సిగ్గుపడుతూ కనిపించింది. తన ఎరుపెక్కిన బుగ్గల్లో సిగ్గంతా బహిర్గతమవుతోంది. ఏది నేటి రోజుల్లో ఇలాంటి అన్యోన్యత చాలా అరుదు. బిజీ లైఫ్ లో ఇలాంటివి మిస్సవుతున్న జంటలకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకం.

నయనతార - విఘ్నేష్ శివన్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. జూన్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బలమైన పుకార్లు ఉన్నాయి. విఘ్నేష్ శివన్- నయన్ జంట తాజాగా పోస్ట్ చేసిన కొత్త వీడియోలో నయనతార సిగ్గు పడుతూ కనిపించడంతో అభిమానులు తరచి తరచి చూస్తున్నారు. అందులో అతను నయనతారకు సీఫుడ్ తో టేస్టీ ఆహారం నోటికి అందిస్తున్నాడు. వీడియోలో నయన్ సిగ్గుపడుతూ కనిపించింది.

ఇంతకీ ఈ ఆహారాన్ని ఎక్కడి నుంచి ఆర్డర్ చేసారు? అంటే.. మహాబలిపురంలోని స్థానిక రెస్టారెంట్ నుండి నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఇలా  ప్రియుడు చెంతనే ఉండి  ప్రేమగా తినిపిస్తుంటే నయనతార చాలా సంతోషంగా కనిపించింది. విఘ్నేష్ శివన్ కి ఇలాంటి అరుదైన అవకాశం దక్కినందుకు చాలా ఆనందించారు.

బాగా తినేందుకు సమయం ఆసన్నమైంది..  తనకు ఉత్తమమైన స్థానిక ఆహారాన్ని అందించడమే నా ఉద్ధేశం. ఇష్టమైన సీ ఫుడ్ రెస్టారెంట్ లో అరుదైన రుచికరమైన ఆహారాన్ని ఆస్వాధించాం...అని అన్నారు.

విఘ్నేష్ - నయన్ జంట జూన్ 9న తిరుమల ఆలయంలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. నయనతార-సమంత- సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన కాతు వాకుల రెండు కాదల్ కి విఘ్నేష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చక్కని వసూళ్లను సాధించింది. నయన్ వరుస చిత్రాలతో బిజీగా ఉండగా విఘ్నేష్ తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు.