మ్యారేజ్ తర్వాత నయన్ రేంజ్ పీక్స్ కి!

Tue Jun 28 2022 20:00:01 GMT+0530 (IST)

Nayantara Range Peaks After Marriage!

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు మైలేజ్ తగ్గిపోతుంది. అత్తారింట్లో కాలు పెట్టిన కొత్త కోడల్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. రూలావణ్యం సహా శరీర సౌష్టవంలో మార్పులు సహజంగానే చోటు చేసుకుంటాయి. ఎంత మెయింటైన్ చేసినా నార్త్ భామలంతా ఫిట్ గా సౌత్ భామలు కనిపించరు. ఆ కారణంగా మార్కెట్ లో డిమాండ్ తగ్గుతుంది.స్టార్ డమ్ బీటలు బారడంతోనే ఈ సమస్య మొదలవుతుంది. అందుకే దక్షిణాది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగింది చాలా తక్కువగానే కనిపిస్తుంది. తన అందంతో పెళ్లికి ముందు ప్రపంచాన్నే శాషించిన ఐశ్వర్యారాయ్ పెళ్లి తర్వాత ఎలాంటి రూపంలోకి మారిపోయిందో చూసాం. దీంతో  ఐష్  డిమాండ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఐశ్వర్యారాయ్ పుట్టినిల్లు కర్ణాటక అని తెలిసిందే. ఇటీవలి కాలంలో దీపికా పదుకోణే ముఖంలో..శరీరంలో వస్తోన్న మార్పులు కూడా గమనించవచ్చు. డే బైడే చబ్బీగాళ్ గా మారిపోతుంది. పెళ్లైన రెండేళ్ల వరకూ బాగానే మెయింటైన్ చేసింది. ఆ తర్వాత పాత్రల పరంగా వచ్చిన మార్పులు కావొచ్చు..శరీరతత్వం కావొచ్చు కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ భామది బెంగుళూరే. దక్షిణాది నుంచి వెళ్లి ఉత్తరాది స్థిరపడిన భామల పరిస్థితే ఇలా ఉందంటే?  ఇక్కడే ఉండే హీరోయిన్ల పరిస్థితి ఏంటి?  అవును ఇప్పుడీ సందేహం నయనతార పెళ్లి చేసుకోవడంతోనే మొదలైంది. ఇటీవలే నయన్ ప్రేమించిన చెలికాడు విగ్నేష్ శివన్ ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. విగ్నేష్ తో లవ్ లో పడకముందు..పడిన తర్వాత అమ్మడి ఇమేజ్ కి ఏ ఢోకా లేదు.

సౌత్ లో ఒకే దూకుడుతో కొనసాగింది. అయితే ఇకపై అలా ఎంత కాలం సాగుతుందో?  ముందే గ్రహించిందో ఏమో తెలియదు గానీ నయన్ తాజాగా పారితోషికం అదనంగా పెంచినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కొత్తగా సంతకం చేసే ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకూ డిమాండ్  చేసిందిట. మ్యారేజ్ ముందు ఇదే భామ 6 కోట్లు తీసుకునేది.

ఇప్పుడు అదనంగా  నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందిట. మరి దీన్ని ముందు జాగ్రత్త అనాలా?  విగ్నేష్ తో పెళ్లైన తర్వాత   స్టార్ డమ్ రెట్టింపు అవుతుందన్న ఆలోచనతో ఇలా మ హైక్ చేస్తుందా? అన్నది తెలియాలంటే కొన్నిరోజులు  ఆగాల్సిందే.