నయనతార టాలీవుడ్ లో ఇక నటించరా?

Thu Oct 15 2020 05:00:04 GMT+0530 (IST)

Shock: Will Nayantara Dont star in Tollywood again?

కొన్ని నియమనిబంధనల విషయంలో తమిళ తంబీలు ఎంత కఠినంగా ఉంటారో తెలిసినదే. తమిళ సినిమాల్ని నేటివిటీకి దగ్గరగా తీయడంలో అలాగే తమిళ భాషకు ప్రాధాన్యతనివ్వడంలో లోకల్ కల్చర్ కి పెద్ద పీట వేస్తూ కథలు రాయడంలో తంబీలకు తంబీలే సాటి.ఇక తమిళంలో తలైవి రేంజుకు ఎదిగిన నయనతారకు తమిళులంటే అమితమైన ప్రేమ. ఇక నయనతారను దేవతగా కొలుస్తూ ఆరాధిస్తుంటారు తమిళ తంబీలు. అందుకే ఆ బంధం విడిపోనిది. ఇప్పటికీ ఎప్పటికీ తమిళ పరిశ్రమను మాత్రం నయన్ వదిలి పెట్టేదే లేదు. ఇక తమిళంతో పాటు తెలుగులోనూ నయనతారకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగు ఆడియెన్ లో వీరాభిమానులే ఉన్నారు.

అయితే నయన్ కి ఉన్న కొన్ని పరిమితుల వల్ల తెలుగు సినిమాల్లో ఇటీవల ఎక్కువగా నటించే అవకాశం లేకుండా పోతోంది. చిరంజీవి .. బాలయ్య రేంజు వెటరన్స్ సినిమాలు మినహా నయన్ వేరే ఏవీ అంగీకరించడం లేదు. భారీగా పారితోషికం ముడితేనే తెలుగు సినిమాలకు ఓకే చెప్పేది. కానీ తాజా సన్నివేశం చూస్తుంటే సీన్ వేరేలా కనిపిస్తోంది. ఇక నయనతార తెలుగు సినీపరిశ్రమకు గుడ్ బై చెప్పేసే సమయం వచ్చేసిందని చెబుతున్నారు.

తెలుగు సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేసిన నయనతార.. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ప్రమోషన్స్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో తెలుగు సినిమాలు నుంచి దాదాపుగా నయన్ తప్పుకున్నట్లే అని టాక్ ప్రస్తుత ఇండస్ట్రీలో మొదలైంది. అయితే వెటరన్ స్టార్స్ కి కథానాయికల కొరత వేధిస్తోంది కాబట్టి నయన్ కాకుండా వేరే ఆప్షన్ ఏం ఉందో ఆలోచించాల్సి ఉంటుందేమో! నయనతార ప్రస్తుతం హబ్బీ విఘ్నేష్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం సహా రజనీకాంత్ సినిమాలోనూ నాయికగా నటిస్తోంది. తమిళ అగ్ర హీరోలు నయన్ కాల్షీట్ల కోసం పడిగాపులు పడుతున్నారు మరి.