మీడియా నా గురించి తప్పుగా రాసింది: స్టార్ హీరోయిన్

Tue Jul 14 2020 19:30:10 GMT+0530 (IST)

The media wrote badly about me: the star heroine

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార. ప్రస్తుతం తమిళ తెలుగు ఇండస్ట్రీలలో భారీ సినిమాల ఆఫర్లు దక్కించుకుంటూ ఇంకా తన హవా కొనసాగిస్తోంది. అలాగే భారీ పారితోషికం కూడా అందుకుంటుంది. దాదాపు పన్నెండేళ్లకు పైనే సినిమాలలో నటిస్తూ సినీ ప్రియులను అలరిస్తున్న నయన్.. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. అయితే గత కొన్నేళ్లుగా తన పంథా మార్చేసింది. గ్లామర్ షో కాస్త తగ్గించేసి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసుకుంటూ పోతుంది. సినిమాల పరంగా టాప్ లో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఆమెకు సంతృప్తి లేదనే చెప్పాలి. ఈ మధ్య తన ప్రేమ పెళ్లి విషయాలతో తరచూ వార్తలలో ఆమె పేరు వినిపిస్తుంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న నయన్ సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నా పర్సనల్ లవ్ లైఫ్ లో రెండుసార్లు ఫెయిల్ అయింది. మొదట ఓ సినీ హీరోని ముందే వదిలించుకొని ప్రముఖ కొరియోగ్రాఫరును మాత్రం పెళ్లి పీటలెక్కే ముందు వదిలేసింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న నయన్ జీవితంలోకి ఈసారి డైరెక్టర్ వచ్చాడు. అతనే విఘ్నేష్ శివన్. ‘నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటి నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు.

అయితే ఇటీవలే తను ఇంటర్వ్యూలలో ఎందుకు పాల్గొనదో కారణం చెప్పేసింది. "నా మనసులోని భావాలు ప్రపంచానికి చెప్పడం ఇష్టం లేదు. నేను కంప్లీట్ ప్రైవేట్ మనిషిని. అందుకే ఎక్కడా నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను. కేవలం సినిమాల గురించి మాట్లాడతాను. ఇదివరకే పలుమార్లు మీడియా నా గురించి తప్పుగా రాసింది" అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ భామ ఇప్పుడు "కాతు వాకుల రెండు కాదల్" అనే సినిమాలో విజయ్ సేతుపతి సమంతలతో కలిసి నటిస్తోంది. ఇక త్వరలో పెళ్లి వార్త చెబుతుందేమో అని అభిమానులు సినీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

TAGS: Nayanatara