Begin typing your search above and press return to search.

కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకుంటూ ఈ ప్రపంచాన్నే మరిచిపోయిన లవ్ బర్డ్స్..!

By:  Tupaki Desk   |   18 Sep 2020 4:31 PM GMT
కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకుంటూ ఈ ప్రపంచాన్నే మరిచిపోయిన లవ్ బర్డ్స్..!
X
సౌత్ సినీ ఇండ‌స్ట్రీ లవ్ బర్డ్స్ నయనతార - విగ్నేష్ శివన్ గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నా పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ మధ్య ప్రపంచ దేశాలన్నీ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఓనమ్ పండుగ కోసం స్పెషల్ ఫ్లైట్‌ లో కొచ్చికి తిరిగి వచ్చారు. నయన్ ఇంట్లో ఓనం పండుగను ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఓనం పండుగ సెలబ్రేషన్స్ అయ్యాక ఈ ప్రేమ పక్షులు గోవాలో వాలాయి. అక్కడ కాండోలిమ్ బీచ్‌ రిసార్ట్‌ లోని గార్డెన్‌ లో నయన్ పూలు తెంపుకుంటుండగా తీసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేసాయి.

కాగా, నేడు విగ్నేష్ శివన్ బర్త్ డే సందర్భంగా గోవా బీచ్ లో నయన్‌ తో జాలీగా గడిపేస్తున్నట్టు తెలుస్తోంది. నయన్ తన బాయ్ ఫ్రెండ్ తో కేక్ కట్ చేపించింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసిన విగ్నేష్.. నయన్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసాడు. దీనికి 'బర్త్ డే వైబ్స్.. దేవుని దయ.. మీ వండర్ ఫుల్ స్వీట్ విషెస్' అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫొటోలో ఇద్దరూ పక్కనే నిల్చుని ఒకరి నడుముని మరొకరు పట్టుకుని.. కళ్లల్లో కళ్లు పెట్టి ఒకరినొకరు చూసుకుంటూ కనిపిస్తున్నారు. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ - నయనతార కాంబినేషన్ లో వచ్చిన 'నానమ్ రౌడీ ధాన్' సినిమా సమయంలో వారిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్న ఈ జంట పెళ్లిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.