Begin typing your search above and press return to search.

పిల్లల కోసం ప్రాక్టీస్ చేస్తున్న నయన్ దంపతులు..!

By:  Tupaki Desk   |   24 Sep 2022 3:57 AM GMT
పిల్లల కోసం ప్రాక్టీస్ చేస్తున్న నయన్ దంపతులు..!
X
దక్షిణాది అగ్ర కథానాయిక, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్ తో మూడు ముళ్ళు వేయించుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.

విగ్నేష్ - నయన్ జంట డేటింగ్ లో ఉన్నప్పుడు ఎలా చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాళ్ళో.. భార్యాభర్తలుగా మారిన తర్వాత ఇప్పుడు కూడా అలానే ఎంజాయ్ చేస్తున్నారు. ఏమాత్రం సమయం దొరికినా స్పెసిల్ ఫ్లైట్ లో హాలీడేకి ఎగిరిపోతున్నారు.

సెలబ్రిటీ కపుల్ ఎప్పటికప్పుడు తమ టూర్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ పంచుకుంటున్నారు. విఘ్నేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇటీవల దుబాయ్ వెళ్లారు.

ప్రస్తుతం అక్కడే ఉన్న ఈ జంట.. దుబాయ్ లో గడిపిన సరదా క్షణాల గురించి ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నారు. నయనతార మరియు విఘ్నేష్ శివన్ కొంతమంది చిన్నారులతో కలిసి ఆటలు ఆడుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియాలో తెలిపారు.

అంతేకాదు కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ.. 'భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం' అంటూ దీనికి క్యాప్సన్ జోడించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మీరు కూడా అలా పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోవాలంటే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తన భర్త పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా నిర్వహించింది నయన్. ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వ‌నంగా పేరున్న బుర్జ్ ఖ‌లీఫా ముందు కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేసింది. విఘ్నేష్ ఫ్యామిలీ మెంబర్స్ సైతం పాల్గొన్నారు.

పెళ్లికి ముందు ఇలాంటి వేడుకలు ఎన్నో చేసుకున్నప్పటికీ.. వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత వచ్చిన తన భర్త ఫస్ట్ బర్త్ డే కావడంతో.. మరింత ప్రత్యేకంగా ఉండేలా సెలబ్రేషన్స్ చేసింది. దీనికి విగ్నేష్ శివన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో తెలిపిన విగ్నేష్.. పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు సంబంధించిన పిక్స్ ని షేర్ చేశాడు. “నా భార్య నా బంగారం అద్భుత‌మైన స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. నన్నెంతో ప్రేమించే వ్య‌క్తుల మ‌ధ్య బుర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర ఈ పుట్టిన‌ రోజును చేసుకోవడం క‌ల‌ లాగా ఉంది. ఇంతకంటే ప్ర‌త్యేక‌త‌ను నేను ఊహించ‌లేను'' అంటూ దర్శకుడు ఎమోషల్ పోస్ట్ పెట్టారు.

కాగా, గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న నయన్ - విఘ్నేష్ జంట.. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే వీరి పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలు తప్ప ఇతర వీడియోలేవీ బయటకు రాలేదు. దీనికి కారణం వివాహ కార్యక్రమాన్ని డాక్యుమెంటరీ రూపంలో ప్రీమియర్ చేయడానికి ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడమే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" అనే పేరుతో త్వరలోనే ఫుల్ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇక. సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' లో నయనతార కీలక పాత్ర పోషించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అలానే షారుక్ ఖాన్ 'జవాన్' చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మరోవైపు విఘ్నేష్ శివన్ త్వరలో అజిత్ కుమార్ హీరోగా AK62 మూవీని డైరెక్ట్ చేయనున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.