గాజులమ్మేవాడి ప్రేమలో మిల్కీ

Mon Jul 15 2019 20:57:33 GMT+0530 (IST)

గాజులమ్మే కుర్రాడితో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో పడిందా? అంటే ప్రేమ నిజమే.. అయితే ఆ ప్రేమ రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో! అని చాలా స్పష్టంగా చెప్పింది. ఓవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ లో మిల్కీ ప్రయోగాలు చేస్తోంది. అక్కడ క్రేజీ హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ ఏకంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి ట్యాలెంటెడ్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది.నవాజుద్దీన్ - తమన్నా జంటగా నటిస్తున్న తాజా సినిమా `బోలే చుడియాన్` ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో నవాజ్ సోదరుడు షమాస్ నవాబ్ సిద్దిఖీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అతడు తొలి ప్రయత్నమే ఆసక్తికర కథాంశాన్ని ఎంచుకున్నారని అర్థమవుతోంది. గాజులు అమ్మే యువకుడికి ఓ పల్లెటూరి అమ్మాయికి మధ్య ప్రేమ నేపథ్యంలో తెరకెక్కుతుకున్న చిత్రమిది. త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా నవాజుద్దీన్ పాడిన ఓ పాట వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. స్వాగే చూడియాన్ అంటూ సాగే ఈ పాటను నవాజుద్దీన్ -తమన్నా స్వయంగా పాడారు. నవాజ్ తొలిసారి పాడిన పాట ఇది. తనని పాడమని అడిగినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలైనా .. ప్రాక్టీస్ చేశాక సులువుగానే పాడేశాడట. అయినా ఈ రోజుల్లో అందరూ పాడేస్తున్నారు. అందుకే నవాజ్ తో పాడిస్తే బావుంటుందని ఈ ప్రయోగం చేశామని దర్శకుడు వెల్లడించారు.

`బాహుబలి` పెద్ద కాన్వాస్ ఉన్న సినిమా అయితే .. బోలే చుడియాన్ తనకు పేరు తెచ్చే సినిమా అవుతుందని తమన్నా కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఈ చిత్రంలో తనని అభిమానులు కొత్తగా చూడొచ్చని కాన్ఫిడెంట్ గా తెలిపింది. నవాజ్ నటన చూసి ఆశ్యర్యపోయానని.. షూట్ చివరి నాటికి నవాజ్ నటన సీక్రెట్ కనిపెట్టేస్తానని మిల్కీ బ్యూటీ తెలిపింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా ఉద్వేగాలు పలికిస్తానని వెల్లడించింది.