Begin typing your search above and press return to search.

అందంగా ఉన్నారు సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అంటే బిగ్ బి మనమరాలు ఆన్సర్ ఇది!

By:  Tupaki Desk   |   30 July 2021 3:30 AM GMT
అందంగా ఉన్నారు సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అంటే బిగ్ బి మనమరాలు ఆన్సర్ ఇది!
X
మెరిసిపోయే అందం అన్నంతనే సినిమాల్లోనో.. మోడల్ గానో.. మొత్తంగా గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వొచ్చన్న కామెంట్లు.. ఉచిత సలహాలు ఇవ్వటం చాలామందిలో కనిపిస్తుంది. అందులోని సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే.. వారి పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనమరాలు నవ్య నవేలిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.

బాలీవుడ్ హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని అందం.. వన్నె ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె చేసే పోస్టులు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకట్టుకుంటాయి. నవ్యకు భారీగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పోస్టు చేసే పోస్టులను చూసినోళ్లంతా బచ్చన్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ రావటం ఖాయమన్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తాయి. తాజాగా ఆమె పింక్ కలర్ డ్రెస్ తో ఉన్న ఫోటోను పోస్టు చేసింది. చూసినంతనే వావ్ అనిపించేలా ఉన్న ఈ ఫోటోకు భారీ ఎత్తున సానుకూల స్పందనలు వెల్లువెత్తటమే కాదు.. బ్యూటీఫుల్ అంటూ బోలెడన్ని కాంప్లిమెంట్లు వచ్చాయి.

ఒక అభిమాని అయితే కాస్త చొరవ తీసుకొని.. చాలా బ్యూటీఫుల్ గా ఉన్నారు. బాలీవుడ్ లో ట్రై చేయొచ్చుగా అంటూ వ్యాఖ్య చేశారు. దీనికి నవ్య రియాక్టు అయ్యింది. చాలా పొందికగా ఆమె ఆన్సర్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. మీ అభిమానానికి థ్యాంక్స్ అంటూనే.. అందమైన మహిళలు వ్యాపారాల్లోనూ రాణించగలరు అంటూ బదులిచ్చింది.

తాజా పోస్టుతో తనకు సినిమాల మీద ఆసక్తి లేదన్న విషయాన్ని సూటిగా చెప్పకుండా.. అందమైన మహిళలకు.. వారి ప్రతిభకు గుర్తింపు సినిమాలు మాత్రమే కాదు.. మరిన్ని వేదికలు ఉన్నాయన్న విషయాన్ని చెప్పేసిందని చెప్పాలి. అందాల ముద్దుగుమ్మ అందంలోనే కాదు.. అంతకు మించిన తెలివి సొంతమన్న విషయం తాజా పోస్టుతో స్పష్టమైందని చెప్పాలి.