జాతిరత్నం ఆచితూచి అడుగులు

Mon May 10 2021 08:00:01 GMT+0530 (IST)

Naveen polishetty thought and took the movies

నటుడిగా సుదీర్ఘ కాలంగా ట్రైల్స్ చేస్తున్న నవీన్ పొలిశెట్టి థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ తెలుగు.. హిందీల్లో చిన్నా చితకా పాత్రల్లో నటిస్తూ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మారాడు. అదే సమయంలో హిందీలో చిచ్చోర్ తో కూడా గుర్తింపు దక్కించుకున్నాడు. హిందీ మరియు తెలుగులో ఒకే సారి గుర్తింపు దక్కించుకున్న నవీన్ కు జాతిరత్నాలు సినిమాతో తెలుగు లో ఒక్కసారిగా స్టార్ డం దక్కింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి హిందీ నుండి ఆఫర్లు వస్తున్నాయి. కాని ఆయన మాత్రం తెలుగులోనే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.చిచ్చోర్ మేకర్స్ చేయబోతున్న ఒక సినిమాలో నవీన్ పొలిశెట్టికి ఒక పాత్రను ఆఫర్ చేశారట. కాని ఆ పాత్రను నవీన్ సున్నితంగా తిరష్కరించాడట. జాతిరత్నాలు సినిమా తర్వాత టాలీవుడ్ లో పేరున్న దర్శకులు నవీన్ తో సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లో ఎక్కువ స్కోప్ ఉన్న కారణంగా హిందీ సినిమా ఆఫర్లను సున్నితంగా తిరష్కరిస్తూ ఆచి తూచి అడుగులు వేస్తూ తెలుగు సినిమాలకు కమిట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి తన తదుపరి సినిమా విషయంలో ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు కాని త్వరలోనే ఒక ప్రముఖ దర్శకుడితో సినిమా ను నవీన్ ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

జాతిరత్నాలు సీక్వెల్ ను చేయాలని భావిస్తున్నారు. దాంతో పాటు ఒకటి రెండు స్క్రిప్ట్ లను కూడా నవీన్ ఓకే చేశాడని.. కరోనా పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. స్క్రిప్ట్ రైటింగ్ పై మంచి పట్టు ఉన్న నవీన్ పొలిశెట్టి ముందు ముందు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడనే నమ్మకంను ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. నవీన్ తదుపరి సినిమా కోసం వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు.