ఎన్నో అంచనాలు అన్నీ తలక్రిందులు: యంగ్ హీరో

Mon Jun 01 2020 18:30:24 GMT+0530 (IST)

Many expectations are all upside down: Young Hero

టాలీవుడ్ లో హీరోగా తన ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు నవీన్ పోలిశెట్టి. టాలెంట్ ఉన్నా అవకాశాలు లేవని నవీన్ ని చూస్తే అర్ధమవుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 1నేనొక్కడినే కనిపించినా రాని పాపులారిటీని హిందీ షార్ట్ ఫిలింలు స్పెషల్ వీడియోలతో సంపాదించుకున్నాడు. చాలా కాలం తర్వాత సినిమాలలో అవకాశాలు అందుకొని గతేడాది ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి విభిన్నమైన సినిమాతో హీరోగా అరంగేట్రం చేసాడు. ఆ సినిమా భారీ హిట్ అవ్వడంతో నవీన్ హీరోగా చాలా బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. నిజానికి ఈ సినిమాకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వరించాయి. నవీన్ వెంటనే హిందీలో ‘చిచ్చోరే’ సినిమాలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం నవీన్ కొత్త సినిమా ‘జాతి రత్నాలు’ పై ఆసక్తి నెలకొంది. కరోనా వలన అది విడుదలకు నోచుకోలేదు.ఇక రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న నవీన్.. ఖాళీగా ఉండకుండా వీడియోలు చేస్తున్నాడు. హిందీ ఫాలోవర్ల కోసం ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియో మంచి రెస్పాన్స్ పొందింది. తాజాగా తెలుగు వారికోసం ఒక వీడియో చేశాడు. ఇది చూస్తే నవీన్ ఎంత మంచి పెర్ఫామర్ అనే విషయం మరోసారి అర్థమవుతుంది. కరోనాకి ముందు తర్వాత తన అనుభవాలను కలిపి నవీన్ ఈ వీడియో చేసాడు. ఫోన్ సంభాషణ నేపథ్యంలో ఈ వీడియో మొత్తం సాగింది. "కరోనా రావడానికి ముందు 2020 మీద భారీ అంచనాలతో ఏడాదిని మొదలుపెట్టడం ‘జాతి రత్నాలు’ సినిమా గురించి బిల్డప్‌లు ఇవ్వడం.. మధ్యలో కరోనా గురించి చాలా తేలిగ్గా మాట్లాడటం.. కరోనా దెబ్బకు కూలడం.. ప్రస్తుతం వాస్తవాలు గ్రహించి సైలెంట్ అవ్వడం.." ఈ అంశాల పై వీడియో చేసాడు. కేవలం ఫోన్ సంభాషణతోనే ఐదు నిమిషాలకు పైగా ఏమాత్రం బోర్ కొట్టించకుండా వీడియోను నడిపించాడు నవీన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఎన్నో అంచనాలు తలకిందులు అయిందని మీకే అర్ధమవుతుంది. నవీన్ ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ లో 10నిముషాల భారీ డైలాగ్స్ కూడా అవలీలగా చెప్పేసాడు. కానీ జాతి రత్నాలు సినిమా ఎప్పుడొస్తుందో ఈ జాతిరత్నం మాత్రం ఇంకా చెప్పలేదు.