ట్యాలెంటెడ్ హీరోకు మూడు బ్రేకప్ లు గుర్తుకు వచ్చాయట

Thu Mar 04 2021 14:00:01 GMT+0530 (IST)

Naveen Polishetty Talking About His Breakups

ట్యాలెంటెడ్ హీరోగా నవీన్ పొలిశెట్టికి ఇప్పటికే గుర్తింపు దక్కింది. అతడి సినిమాల ఎంపిక అతడి పాత్రల ఎంపిక నిజంగా అద్బుతం అంటూ ఆయన అభిమానులు మరియు సన్నిహితులూ ఉంటూ ఉంటారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా లో నవీన్ పొలిశెట్టి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ఈయన త్వరలో 'జాతి రత్నాలు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ను వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా సాగినట్లుగా మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈనెల 11వ తేదీన రాబోతున్న జాతి రత్నాలు సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యంగా హీరో నవీన్ మరియు హీరోయిన్ ఫరియాలు బుల్లి తెరపై సందడి చేస్తున్నాడు.జాతి రత్నాలు ప్రమోషన్ లో భాగంగా ఈటీవీలో ప్రసారం అయ్యే క్యాష్ మరియు జీ తెలుగులో ప్రసారం అయ్యే సరిగమప షో లకు హాజరు అయ్యాడు. సరిగమప షో లో పాల్గొన్న సమయంలో యాంకర్ ప్రదీప్ తో కలిసి నవీన్ సరదగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. నువ్వే నువ్వే ఆల్బం పాట ఎపిసోడ్ చూస్తున్న సమయంలో నా మూడు బ్రేకప్ లు గుర్తుకు వచ్చాయని నవీన్ అన్న సందర్బంగా మరి మిగిలిన మూడు అంటూ ప్రదీప్ ప్రశ్నించగా అవి వేరే పాట కోటి గారి పాట కాదు అంటూ నవీన్ అంతే సమయస్ఫూర్తిగా సమాధానం ఇచ్చాడు. మొత్తానికి జాతి రత్నాలు ప్రమోషన్ లో భాగంగా నవీన్ పొలిశెట్టి చేస్తున్న బుల్లి తెర సందడి అంతా ఇంతా కాదు.