శృంగార తారతో యంగ్ హీరో సరసాలు

Wed Oct 09 2019 10:51:48 GMT+0530 (IST)

Navdeep to team up with Sunny Leone for a web series

ప్రతిభ ఉన్నా లక్ కలిసొస్తేనే మనుగడ ఇక్కడ. ఈ విషయంలో హీరో నవదీప్ కి లక్ ఫేవర్ కాలేదు. ట్యాలెంట్ ఉన్నా ఎందుకనో అతడికి పెద్ద స్థాయి సినిమాలు దక్కలేదు. హీరోగా ఛాన్సులు తగ్గాయి. పెద్దగా మార్కెట్ లేకపోవడంతో గత కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు నవదీప్. ప్రస్తుతం స్నేహితుడు అల్లు అర్జున్ తో కలిసి `అల వైకుంఠపురంలో` నటిస్తున్న నవదీప్ కు ఊహించని జాక్ పాట్ తగిలింది. అది కూడా బాలీవుడ్ నుంచి...!ఈ ఆఫర్ సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఈ ఆఫర్ వచ్చింది ఆషామాషీ కంపెనీ నుంచి కాదు. బాలీవుడ్ లో  ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ బ్యానర్ లో ఛాన్స్. ఈ బ్యానర్ అంటే యూత్ లో ఉండే క్రేజు వేరు. రాజ్ కుమార్ రావ్.. లాంటి మామూలు నటుడిని పెద్ద స్టార్ ని చేసింది ఈ సంస్థనే. యూత్ ఫుల్ కంటెంట్.. హాట్ స్పైసీ సినిమాలకే కేరాఫ్ అడ్రెస్ ఈ సంస్థ. దాదాపు ఎరోటిక్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. తాజాగా తను నిర్మించిన `రాగిణి ఎంఎంఎస్`ని వెబ్ సిరీస్ గా అందించబోతోంది. సీజన్ 2ని సన్నీలియోన్ కీలక పాత్రలో ప్రారంభించింది. ఇందులో నవదీప్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

దీంతో సినిమా ప్రపంచం నుంచి నవదీప్ డిజిటల్ దునియాలోకి ఎంటరవుతున్నాడు. గతంలో తెలుగులో యప్ టీవీ సిరీస్ లోనూ నటించాడు. నందినిరెడ్డి ఈ ప్రాజెక్టులో భాగమైన సంగతి తెలిసిందే. అయితే అది అంతగా పాపులర్ కాలేదు. తాజాగా వచ్చిన ఆఫర్ బాలీవుడ్ లో కావడం.. పేరున్న ఆల్ట్ బాలాజీ సంస్థలో ఛాన్స్ అనగానే నవదీప్ వెంటనే అంగీకరించాడట. హారర్ కంటెంట్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. దీన్ని సౌత్ లోనూ మార్కెట్ చేయాలంటే సౌత్ కు సంబంధించిన నటీనటులు వుండాలన్న ఆలోచనలో భాగంగానే నవదీప్ ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.