ఆ హీరో క్రొయేషియాలో ఏం చేస్తున్నాడబ్బా?

Tue Aug 20 2019 13:50:44 GMT+0530 (IST)

Navdeep Enjoying in Croatia

హీరోగా ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేవు కానీ క్యారెక్టర్ అర్టిస్ట్ గా కొనసాగుతూ బిజీగా ఉన్నాడు నవదీప్.  కొద్దిరోజుల క్రితం తన సిక్స్ ప్యాక్ అవతారంతో అందరికీ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు.  చరణ్.. అల్లు అర్జున్.. రానా లాంటి మిత్రుల ప్రేరణతో ఫిట్నెస్ పై ఫోకస్ చేసి ఆరునెలలు జిమ్ లో వర్క్ అవుట్స్ చేశానని కూడా వెల్లడించాడు.   ప్రస్తుతం నవదీప్ బాబు క్రొయేషియా దేశంలో చిల్ అవుట్ అవుతూ ఉన్నాడు.నవదీప్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ఫిలిం 'అల వైకుంఠపురములో' లో ఒక కీలకపాత్ర పోషిస్తున్నాడు.  రీసెంట్ గానే తన పాత్రకు సంబంధించిన షూట్ అంతా కంప్లీట్ చేశాడట.  దీంతో ఒక వెకేషన్ కోసం క్రొయేషియాకు విమానం ఎక్కాడని సమాచారం.  అక్కడ ప్రస్తుతం మ్యూజిక్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి.  పైగా యూరోపియన్ కంట్రీ కావడంతో బికినీలతో చిట్టిపొట్టి నిక్కర్లతో తిరుగుతూ ఉంటారు.  చిత్రమైన విషయం ఏంటంటే దీనిపై అక్కడ ఉండే జనాల మనోభావాలు దెబ్బతినవు. మతవిశ్వాసాలకు కూడా ఏమీ ఇబ్బంది రాదు! అందుకేనేమో నవదీప్ ఒక వీడియో పోస్ట్ చేసి "జాతి లేదు.. వర్ణం లేదు.. స్థాయి భేదం లేదు.. గుర్తులు లేవు.. దుస్తులు లేవు.. బాధలు లేవు.  క్రొయేషియా అడవుల్లో ఒక మ్యూజిక్ ఫెస్టివల్.   ఏమీ వదులుకోలేదు. కొన్ని జ్ఞాపకాలను మాత్రం వెనక్కు తీసుకొస్తున్నా" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చాడు.  కాస్త ఫిలాసఫీ టచ్ ఉండే కత్తి లాంటి క్యాప్షన్ ఇచ్చాడు కదా?

ఈ వీడియోకు ఒక నెటిజన్ స్పందిస్తూ ఇలాంటి ఫెస్టివల్స్ మన తెలంగాణాలో కూడా ఉండాలి అని కోరుకున్నాడు.  ఇలాంటి బికినీ ఫెస్టివల్స్ ఇక్కడ జరగడం చాలా కష్టం కానీ నవదీప్ హాలిడే ట్రిప్ కు వెళ్లినట్టు మనం కూడా క్రొయేషియాకో.. థాయిల్యాండు కో.. బ్యాంకాకుకో పోవడం ఒక్కటే దారి.


వీడియో కోసం క్లిక్ చేయండి