Begin typing your search above and press return to search.

ఏంటో న‌వ‌గ్ర‌హాలు.. కంటెంట్ ముఖ్యం కానీ!

By:  Tupaki Desk   |   16 Feb 2020 6:30 AM GMT
ఏంటో న‌వ‌గ్ర‌హాలు.. కంటెంట్ ముఖ్యం కానీ!
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమాకు స్క్రిప్ట్ ప‌నులు దాదాపు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టేన‌ని తెలుస్తోంది. వ‌రుస ఫ్లాప్ లు బాల‌య్య‌లో జాగ్ర‌త్త‌ను పెంచాయని.. గ‌త సినిమాల్లా ఈసారి బోయ‌పాటిని అంత ఈజీగా వ‌ద‌ల్లేదని ఇటీవ‌ల ర‌క‌ర‌కాల క‌థ‌నాలొచ్చాయి. బౌండ్ స్క్రిప్ట్ ను ది బెస్ట్ గా సిద్ధం చేశాకే సినిమా మొద‌లు పెడ‌దామ‌ని బోయ‌పాటిని ప‌దే ప‌దే తిప్పి పంపించ‌డంపైనా అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఎట్ట‌కేల‌కు ఫైన‌ల్ స్క్రిప్టును లాక్ చేసారు. ఇందులో బాల‌య్య రెండు డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఒక‌టి అఘోర పాత్ర అయితే.. మ‌రొక‌టి స్టైలిష్ రోల్. ఇక బోయ‌పాటి ముందున్న పెద్ద స‌వాల్ ఈ స్క్రిప్టును తాను చెప్పిన‌ట్టుగానే తెర‌పై ఎగ్జిక్యూట్ చేయ‌డ‌మే.

ప్ర‌స్తుతం బోయ‌పాటి అందుకు సంబంధించి స‌ర్వ స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌ట‌. ఈనెల 26 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తార‌ని తెలిసింది. తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. అఘోరా పాత్ర‌కు క‌నెక్టింగ్ గా బోయ‌పాటి స్క్రిప్టులో న‌వ గ్ర‌హాల కాన్సెప్ట్ కూడా ఉందిట‌. అంటే బాల‌య్య‌-బోయ‌పాటి స్క్రిప్టు ఏదైనా సెంటిమెంట్ల‌ను మాత్రం అస్స‌లు వ‌దిలిపెట్టేట్టు లేరు. బాల‌య్య గొప్ప దైవ భ‌క్తుడు. పైగా చిన్న వయ‌సులోనే శ్లోకాల‌ను అవ‌పోస‌న ప‌ట్టేసిన దిట్ట‌. స‌మ‌యం.. సంద‌ర్భం కుదిన‌ప్పుడ‌ల్లా వేదిక‌ల‌పై ఆయ‌న త‌న ప్ర‌తిభ‌ను చూపిస్తుంటారు. వారం వ‌ర్జ్యం.. దుర్ముహూర్తం అంటూ ఆయ‌న‌కు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. గ్ర‌హాల్ని.. వాస్తును ప‌క్కాగా న‌మ్ముతారు. విధిని ఎవ‌రూ త‌ప్పించ‌లేర‌ని విశ్వ‌సించే న‌టుడు. అందుకే ఆయ‌న గ‌త సినిమాల్లో ఈ త‌ర‌హా సెంటిమెంట్ల‌కు సంబంధించిన డైలాగుల్ని పంచీగా వినిపించారు. బోయ‌పాటి గ‌త సినిమాల్లోనూ ఆ త‌ర‌హా సంభాష‌ణ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే.

`సింహా` చిత్రంలో బాల‌య్య త‌ల్లి పాత్ర‌లో న‌టించిన కె.ఆర్ విజ‌య భూత భ‌విష్య‌త్ వ‌ర్త‌మానం గురించి చ‌క్క‌గా వివ‌రిస్తారు. గ్ర‌హాల‌ను అధారం చేసుకుని జ్యోతిష్యులు చెప్పిన మాట‌గా చెబుతారు. తాజాగా మ‌రోసారి బాల‌య్య మూవీకి న‌వ‌ గ్ర‌హాల సెంటిమెంట్ ను ఆపాదించార‌ట‌. అఘోర పాత్రకు ఈ గ్ర‌హాల సెంటిమెంట్ తో ముడి వేశార‌ట‌. కార‌ణం ఏదైనా బాల‌య్య- బోయ‌పాటి ఇంకా పాత పంథాని విడ‌వ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. బాల‌య్య‌ సెంటిమెంట్ల‌ను ట‌చ్ చేస్తూ బోయ‌పాటి తుది స్క్రిప్టుని క‌న్విన్స్ చేశారా? అయినా ఈ గ్ర‌హాల సెంటిమెంట్ ఎంత వ‌ర‌కూ క‌లిసొస్తుంది. క‌థ‌ల్లో అస‌లు ద‌మ్ము ఎంత‌? అన్న‌దే ఇటీవ‌ల విజ‌యానికి కార‌ణం అవుతోంది. కంటెంట్ ఉంటే కటౌట్ తో ప‌ని లేద‌ని ప్రూవ్ అయ్యింది. మ‌రి ఇంకా పాత విధానాన్నే అనుస‌రిస్తే ఎలా? అంటూ నెటిజ‌నుల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.