జూనియర్ దేవరకొండ సినిమాకు అదే హైలైట్

Sat Nov 21 2020 13:00:05 GMT+0530 (IST)

Same highlight for Junior Devarakonda movie

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కన్న చిన్న కళను నెరవేర్చుకునేందుకు పడే కష్టం ఆ సమయంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎదుర్కొనే సమస్యలను అతను ఎలా ఫేస్ చేశాడు అనేది సినిమాలో చూపించడం జరిగింది. సినిమాకు ప్రధాన ఆకర్షణగా మిడిల్ క్లాస్ కష్టాలు నిలిచాయి అనడంలో సందేహం లేదు. సినిమాలోని చాలా సీన్స్ సహజత్వంకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.లవ్ సీన్స్ నుండి హోటల్ సీన్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా.. మన పక్కన జరిగిందో లేదా మనకే జరిగిందా అనేట్లుగా ఉంది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. ఒక మద్యతరగతి కుటుంబ పెద్దగా ఆయన నూటికి నూరు శాతం ఇచ్చాడు. పిల్లలపై ప్రేమ ఉంటుంది కాని దాన్ని తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా బయట పెట్టలేరు. అలాంటి కథ కథనం ఇందులో ఉంది. చాలా సహజంగా కొన్ని చోట్ల కళ్లు చెమర్చే విధంగా సన్నివేశాలు ఉండటంతో సినిమా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమా సహజత్వంకు చాలా దగ్గరగా ఉండటమే హైలైట్.