Begin typing your search above and press return to search.

దసరా బడ్జెట్ డబుల్ అయిపోయిందా.. మరి వర్కౌట్ అవుతుందా

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
దసరా బడ్జెట్  డబుల్ అయిపోయిందా.. మరి వర్కౌట్ అవుతుందా
X
ఓ కొత్త రకమైన లుక్కు, అదిరిపోయే కథతో రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమా దసరా. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఓడల డైరెక్ట్ చేస్తున్నారు. దాదాపు ఏడాది నుండి హీరో నాని జుట్టు, గడ్డానని పెంచుతూ మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త లుక్ లో తన ఫ్యాన్స్ కి దర్శనం ఇచ్చారు. మార్చి 30 న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఆర్థిక విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

అదేంటంటే టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్ హీరోల్లో ఒకరు. ఆయన సినిమాకు 30 కోట్లు అంటే సేఫ్ బడ్జెట్. అయితే ఒక్కప్పుడు ఆయన సినిమాలు రూ.50 కోట్ల దాకా బిజినెస్ గ్యారెంటీ అన్నట్లుండేది పరిస్థితి. అయితే కొన్నేళ్లుగా నాని నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నాడు. పెద్ద హిట్లేమీ కొట్టకపోతున్నాడు, ఈ క్రమంలోనే తన చివరి చిత్రం అంటే సుందరానికీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను అందుకోలేకపోయింది. అయినా దసరా చిత్రానికి బడ్జెట్ రూ.35 కోట్లు పెట్టడానికి రెడీ అయిపోయాడు నిర్మాత సుధాకర్ చెరుకూరి.

ఆయన గత చిత్రాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ.. ఈ సినిమా మీద పెద్ద బడ్జెట్ పెట్టారు. అయితే ఒక సినిమా మొదలయ్యే ముందు ఒక బడ్జెట్ అనుకుంటారు కానీ.. తర్వాత ప్రణాళిక ప్రకారం ఏదీ జరగక పోవచ్చు. బడ్జెట్ కొన్ని కోట్లు పెరగడం చూస్తూనే ఉంటాము.ఇప్పుడు దసరా సినిమా విషయంలోనూ అదే జరిగిందట. ఈ చిత్రానికి ఏకంగా బడ్జెట్ రెట్టింపు అయిపోవడం షాకింగ్ విషయం. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రణాళిక ప్రకారం సినిమాను తీయలేకపోయాడా, లేదా క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని, సినిమా పెద్ద రేంజ్ వెళ్లే ఛాన్సుందని అదనంగా ఖర్చు పెట్టుకుంటూ పోయారా, బిజినెస్ ఆఫర్లు చూసి టెంప్ట్ అయ్యారా అన్నది తెలియదు కానీ.. బడ్జెట్ ముందు అనుకున్నదానికంటే దాదాపు రెట్టింపు అయ్యిందట.

సమాచారం ప్రకారం దసరా బడ్జెట్ ఏకంగా రూ.65 కోట్లట. నాని ఒక్కడికే రూ.15 కోట్ల దాకా ఇచ్చినట్లు సమాచారం. కీర్తి కూడా స్టార్ హీరోయిన్ కావడం, పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పని చేయడం.. వర్కింగ్ డేస్ కూడా బాగా పెరిగిపోవడంతో బడ్జెట్ బాగా పెరిగిపోయిందని తెలిసింది. ఇకపోతే అన్ని హక్కులూ కలుపుకుని ఈ చిత్రానికి రూ.80 కోట్ల దాకా ప్రీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.