ప్రకృతి వైపరీత్యం అంటే ఇదే కాబోలు ఆర్జీవీ!

Mon Feb 22 2021 09:20:47 GMT+0530 (IST)

Natural disaster means the same RGV!

ఆర్జీవీ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ప్రచార వేదికలపై తన హీరోయిన్లతో కలిసి స్టెప్పులేసినా.. హగ్గిచ్చి ముద్దులిచ్చినా.. నైట్ వోడ్కా పార్టీల్లో చిందులు వేసినా.. ఆర్జీవీ స్టైలే వేరు!ఇంతకుముందు తన ఫేవరెట్ హీరోయిన్ అప్సరా రాణిని పబ్లిక్ లోనే ముద్దులు పెట్టుకుని సెన్సేషన్ సృష్టించాడు ఆర్జీవీ. అప్సర బూరె బుగ్గల్ని తనివి తీరా ముద్దులాడుతున్న ఆ ఫోటోలు ఇప్పటికీ అంతర్జాలంలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

నాటి నుంచి అప్సరతో వోడ్కా పార్టీలు ఆపినట్టు లేదు. ఇదిగో లేటెస్టుగా ఇలా నైట్ పార్టీలో అప్సరతో ప్రత్యక్షమయ్యారు ఆర్జీవీ. ఆ టేబుల్ పై అసలే ఖాళీ గ్లాసులు దర్శనమిస్తున్నాయి. అందులో పెగ్గు ఏమైందో కానీ..!

``ఏయ్ మిస్టర్ దావూద్ ఇబ్రహీం! హమారే ఫిల్మ్ మే హమారీ ఏంజిల్ క్వీన్ అప్సరా రాణి.. కే ఐటెమ్ సాంగ్ దేక్ నే.. కే బాద్ ఆప్కే.. #డి కంపెనీ కా డ్యాన్స్ ఖతమ్!`` అంటూ ఈ ఫోటోని షేర్ చేయడమే గాక.. వ్యాఖ్యను జోడించారు ఆర్జీవీ. ఫోటోలో అప్సరను ఆలింగనం చేసుకుని ఎలా ఫోజిచ్చారో చూస్తున్నారుగా!!

ప్రకృతి వైపరీత్యం అంటే ఇదే కాబోలు ఆర్జీవీ! అంటూ ఒక వీరాభిమాని ఫన్నీ ట్వీట్ వేసాడు. ఆర్జీవీ అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కోలా ఫన్నీ కామెంట్లతో చెలరేగుతున్నారు.  ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పై `డి కంపెనీ` పేరుతో సినిమా తీస్తున్న ఆర్జీవీ.. ఇందులో వేడెక్కించే హాట్ ఐటెమ్ నంబర్ ని అప్సరా రాణిపై చిత్రీకరించారు. ఆ పాటకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఐటెమ్ సాంగ్ షూట్ పూర్తయింది. అనంతరం ఇలా వోడ్కా పార్టీలో మునిగి తేలారన్నమాట!! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.