Begin typing your search above and press return to search.

నాని కొత్త క‌మిట్మెంట్లు న్యూ ఇయ‌ర్ లోనే!

By:  Tupaki Desk   |   28 Nov 2022 12:30 PM GMT
నాని కొత్త క‌మిట్మెంట్లు న్యూ ఇయ‌ర్ లోనే!
X
2022 ముగింపుకు వ‌చ్చేసాం. మ‌రికొన్ని రోజుల్లో 2022 కి గ‌డ్ బై చెబుతూ 2023 కి వెల్కమ్ చెప్ప‌బోతున్నాం. సెల‌బ్రిటీల‌కి సంబంధించిన రివ్యూలు మొద‌లైపోతాయి. 2022 లో ఏ హీరో ఎంత సాధించాడు? ఏ హీరోయిన్ ఎలా రాణించిందంటూ ఒక‌టే హ‌డావుడి కొనసాగుతుంది. ఏ హీరోది బ్యాట్ టైమ్ న‌డించింద్న‌ది హైలైట్ అవుతుంది.

తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని ప‌రిస్థితిని విశ్లేషిస్తే.. ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. ఈ ఏడాది అంటే సుంద‌రానికీ అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయినా? వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. అంత‌కు ముందు ఏడాది డిసెంబ‌ర్లో శ్యామ్ సింఘ‌రాయ్.. ట‌క్ జ‌గ‌దీష్..వి లాంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

ఇవి బాక్సాఫీస్ వ‌ద్ద‌చ‌తికిల ప‌డిన‌వే. ఇలా వ‌రుస వైఫ‌ల్యాలు నానిని బాగానే ఇబ్బంది పెట్టాయి. ఈ ఏడాది అత‌నికి క‌లిసి రాలేద‌నే చెప్పాలి. నిత్యేం ఏడాదికి రెండు..మూడు సినిమాలు రిలీజ్ చేసే నాని ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఒక్క సినిమా రిలీజ్ చేసారు. ప్ర‌స్తుతం 'ద‌స‌రా' లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది.

ఈ సినిమా తో హిట్ అందుకుని న్యూ ఇయ‌ర్ లో రాణంచాలి. చేతిలో ఐదారు సినిమాల‌తో బిజీ కావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. గ‌త వైఫ‌ల్యాలు మార్కెట్ పరంగా కొంత దెబ్బ కొట్టాయి. దీంతో కొత్త అవ‌కాశాలు అనుకున్నంత‌ వేగంగా రాలేదు. ఈనేప‌థ్యంలో ఆశ‌ల్నీ 'ద‌స‌రా' స‌హా వ‌చ్చే ఏడాదిపైనే కనిపిస్తున్నాయి. ఈ సినిమా తో హిట్ అంద‌కుంటే రేసులోనిలిచిన‌ట్లే.

లేదంటే అవ‌కాశాల ప‌రంగా కొంత ప్ర‌తిష్టంబన త‌ప్ప‌దు. అయితే నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ పై తానే హీరోగా ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడుట‌. అలాగే మ‌రికొన్నినిర్మాణ సంస్థ‌లు నానితో అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు వినిపిస‌స్తుంది. వాటి వివ‌రాలు కొత్త ఏడాది సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న రివీల్ చేయ‌నున్న‌ట్లు తెలిసింది.

మ‌రి ఇందులో వాస్త‌వాలు తెలియాల్సి ఉంది. అలాగే నాని సిస్ట‌ర్ దీప్తి గంటాని కూడా వెబ్ సిరీస్ ద్వారా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. సోద‌రి నాని మెచ్చే క‌థ తెస్తే ఆమెతో సినిమా చేసినా చేయోచ్చు. దీప్తి ఆ వెబ్ సిరీస్ ని చాలా బాగా తెర‌కెక్కించింద‌ని నాని మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.