Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోనూ ఇంత క్యూట్ గా ఉన్న ఈ హీరో ఎవరు?

By:  Tupaki Desk   |   2 Aug 2021 2:30 PM GMT
పిక్‌ టాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోనూ ఇంత క్యూట్ గా ఉన్న ఈ హీరో ఎవరు?
X
మన చిన్నప్పటి ఫొటోలు.. మన స్నేహితుల లేదా మనకు తెలిసిన వారి చిన్నప్పటి ఫొటోలు చూస్తూ ఉంటే కొన్ని సార్లు భలే నవ్వు వస్తుంది. చిన్నప్పుడు ఎంత క్యూట్‌ గా ఉన్నామో కదా అని చాలా మంది చాలా సందర్బాల్లో అనుకుని ఉంటారు. సాదారణ జనాల చిన్నప్పటి ఫొటోలకే అంతగా ఇంటరెస్ట్ చూపిస్తే మన స్టార్స్ చిన్నప్పటి ఫొటోలకు ఎంత బజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా ఒక స్టార్‌ ది చిన్నప్పటి ఫొటో సోషల్‌ మీడియాలో పడితే చాలు దాన్ని వందలు కాదు వేలు కాదు లక్షలు కోట్ల మంది షేర్‌ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెలుగు నెటిజన్స్ తెగ షేర్‌ చేస్తున్న ఈ ఫొటోలో ఉన్నది ఎవరో మీరు గుర్తు పట్టారా.. ప్రస్తుతం టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోగా కొనసాగుతున్నాడు. చిన్నప్పుడు క్యూట్‌ గా ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా క్యూట్‌ హీరో అంటూ పేరు దక్కించుకున్నాడు. నెట్టింట ఎప్పటికి కూడా ట్రెండ్డింగ్ లో ఉండే ఈ యంగ్‌ స్టార్ హీరో మరెవ్వరో కాదు నాచురల్ స్టార్‌ నాని. ఈసారి ఈ క్యూట్‌ తన చిన్నప్పటి ఫొటోతో నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాడు.

సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఈ ఫొటోలతో నాచురల్‌ స్టార్‌ చిన్నప్పుడు కూడా ఇంత క్యూట్‌ గా ఉన్నాడే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నాని సినిమాల విషయానికి వస్తే కరోనా ఉన్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సినిమాలను ముగిస్తున్నాడు. ఇప్పటికే శివ నిర్వాన దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్‌ విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవలే రాహుల్‌ సంకీర్త్యన్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేశాడు. ఇక ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాల్సి ఉంది. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. రాబోయే ఏడాది కాలంలో నాని వరుసగా అయిదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు.