Begin typing your search above and press return to search.

సినిమాలతో బిజీ కానున్న నేచురల్ స్టార్..

By:  Tupaki Desk   |   28 March 2020 12:10 PM GMT
సినిమాలతో బిజీ కానున్న నేచురల్ స్టార్..
X
టాలీవుడ్ లో సంవత్సరానికి మూడు సినిమాలు విడుదల చేసే హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఎల్లప్పుడూ షూటింగ్స్, స్టోరీ డిస్కషన్స్ తో బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ఎప్పుడూ బిజీగా ఉండే నాని ప్రస్తుతం కరోనా వైరస్ వలన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ చెప్పి లాక్ డౌన్ లో భాగంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఫ్యామిలీకి కావాల్సినంత టైమ్ కేటాయించే నాని ఇప్పుడు ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో, సినిమాల తో కాలక్షేపం చేస్తున్నాడట. త్వరలోనే నాని నటించిన 'వి' సినిమా ఈ నెలలో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా వ్యాప్తితో ఇంతకాలం తను మిస్ అయిన సినిమాలన్నిటిని తిరగేయడానికి సిద్దమయ్యాడు.

నాని ఇదివరకే చాలా సార్లు చెప్పాడు తను మూవీ లవర్ అని. షూటింగ్స్ కారణంగా ఇప్పటివరకు చాలా సినిమాలను మిస్సైపోయాడట. ఇక వాటన్నింటిని ఇప్పుడు ఇంట్లో తిరిగేయడానికి టైమ్ దొరికింది కదా.. అంటూ ఫ్యామిలీ తో కలిసి నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలు ఇలా అన్నింటిని చూస్తానని పెద్ద లిస్టే రెడీ చేసుకున్నాడట. నాని కేవలం తెలుగే కాదు. అన్ని లాంగ్వేజిలు చూస్తాడట. తమిళ, హిందీ, హాలీవుడ్ వరకు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటి లలో వీక్షించనున్నాడట. నానికి సినిమాలలో నటించడమే కాదు ఇంట్లో ఉన్నప్పుడు వంట కూడా బాగానే చేస్తాడట. అంతేగాక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. నాని మంచి సరదా హీరో.. అంటూ సినీ వర్గాలు భావిస్తున్నాయి.