'మడ్ బాత్' అంటూ బికినీలో మతులు పోగొడుతున్న సుందరి!!

Sat Jul 04 2020 16:40:52 GMT+0530 (IST)

Nargis Fakhri shared photos of her mud bath

సినీ హీరోయిన్లు అందంగా ఉండటం ఓ లెక్కైతే.. ఆ అందాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా హీరోయిన్లు తమ అందాలను తెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేయడం.. లేదా రిప్రజెంట్ చేసుకోవడంలో స్మార్ట్ తెలివితేటలు కలిగి ఉండాలి. బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీకి అలాంటి తెలివితేటలు బాగానే ఉన్నాయట. మోడల్‌గా ఉంటూనే సినిమాల్లో వెలిగిపోతున్న ఈ న్యూయార్క్ భామ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనలోని కొత్త అందాలను కళాత్మకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది.  అమ్మడు ఇటీవలే డిటాక్సింగ్ కోసం మడ్ బాత్ చేస్తోంది. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే అందాలకు మెరుగులు అద్దుకుంటోంది.తను కాలిఫోర్నియాలో మడ్ బాత్ చేసిన ఫొటోలని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నర్గిస్. ఇక మడ్ బాత్ అంటే మట్టితో స్నానం అని తెలుసుగా.. అమ్మడు గులాబీ రంగు బికినీ ధరించి ఒంటి నిండా ఎర్రమట్టి రాసుకుని ఎండలో నిలబడింది. ఎర్రటి ఎండలో నర్గీస్ అందాలు ధగధగా మెరిసిపోతున్నాయి. ప్రస్తుతం ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎర్రమట్టితో మెరిసిపోతున్న మేని ఛాయతో నర్గీస్ మాములుగా హొయలు పోలేదు. మట్టి ఆరడం కోసం వివిధ భంగిమల్లో ఫొటోలకు పోజులిచ్చి కుర్రకారులో చిచ్చురేపుతోంది. ఇక తన మడ్ బాత్ గురించి మాట్లాడుతూ.. "జీవితంలో ఒక్కోసారి మన శరీరంలోని మలినాలను బయటకు పంపే ప్రయత్నం చేస్తుండాలి.

అప్పుడే కొత్త అందంతో మెరుస్తాం. ఎర్రమట్టి స్నానం శరీరంలోని మలినాలను తొలగించడమే కాదు.. కొత్త స్వాంతనను ఇస్తుంది. మట్టి పూసుకుని ఎండలో నిల్చోవడం వల్ల విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుంది" అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ వారసుడు ఉదయ్ చోప్రాను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని అనుకుంది నర్గిస్. కానీ కొన్నికారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి నర్గిస్ అమెరికా వెళ్ళిపోయిందట. ఇక అమ్మడు మరొకరితో డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం.