ఐదేళ్లు అతడితో డేటింగ్ చేసిన విషయాన్ని తాజాగా రీవీల్ చేసిందే

Tue Sep 14 2021 09:00:25 GMT+0530 (IST)

Nargis Fakhri About Dating With Udhay Chopra

టాలీవుడ్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది బాలీవుడ్ నటీనటుల వ్యవహారం. అక్కడ లవ్ ట్రాకులు.. డేటింగ్ లు.. విడిపోవటాలు.. లాంటివి ఓపెన్ సీక్రెట్ అన్నట్లు ఉంటాయి. టాలీవుడ్ లో ఎవరైనా ప్రముఖ హీరో కానీ హీరోయిన్ కానీ డేటింగ్ లో ఉన్నారన్న విషయం బయటకు రావటం చాలా చాలా అరుదుగా మాత్రమే ఉంటుంది. నిజానికి బాలీవుడ్ తో పోలిస్తే.. టాలీవుడ్ లో ‘రిలేషన్లు’ అంత త్వరగా ఉండవు.తాజాగా ప్రముఖ నటి ఒకరు గతంలో తాను చేసిన సుదీర్ఘ డేటింగ్ గురించి ఓపెన్ అయ్యారు. ప్రముఖ నటుడితో తాను ఐదేళ్లు డేటింగ్ చేసిన విషయాన్ని తాజాగా బయటపెట్టి సంచలనంగా మరారు 41 ఏళ్ల హాట్ భామ నర్గీస్ ఫఖ్రీ. ప్రముఖ నటుడు ఉదయ్ చోప్రాతో తాను సుదీర్ఘ కాలం డేటింగ్ లో ఉన్నట్లు ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

రణబీర్ కపూర్ హీరోగా నటించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన నర్గీస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపుతో పాటు.. యూత్ కు కలల దేవతగా మారింది. హాట్ బ్యూటీగా పేరున్న ఆమె.. ప్రముఖ నటుడు.. దూమ్ సిరీస్ ద్వారా పాపులార్టీ సంపాదించిన ఉదయ్ చోప్రాతో కలిసి డేటింగ్ చేశారని.. సహజీవనం చేస్తున్న వైనం అప్పట్లో హాట్ టాపిక్ గా నడిచేది. దీనిపై మీడియాలో చాలానే కథనాలు వచ్చాయి. అయితే.. వాటిని అప్పట్లో కొట్టేస్తూ.. తాము మంచి స్నేహితులుగా వారు చెప్పుకునేవారు.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం నర్గీస్ ఫక్రీ ఓపెన్ అయ్యారు. ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు తాను డేటింగ్ లో ఉన్నానని.. ఇండియాకు వచ్చిన తర్వాత తాను కలిసిన వ్యక్తుల్లో ఉదయ్ చోప్రా చాలా మంచివాడని పేర్కొంది. మరి.. మీ రిలేషన్ షిప్ గురించి అప్పట్లో ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. సోషల్ మీడియా.. ఇంటర్నెట్ లో వచ్చే ఫేక్ న్యూస్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని.. అందుకే రిలేషన్ గురించి బయట ప్రపంచానికి వెల్లడించొద్దని తనకు చాలామంది చెప్పినట్లు పేర్కొంది.

ఈ కారణంతోనే తాను.. తమ రిలేషన్ గురించి బయటపడలేదని పేర్కొంది. ఈ జంట డీప్ లవ్ లో ఉన్నారని.. వారిద్దరూ పెళ్లి చేసుకోవటం ఖాయమని ప్రచారం జరిగినా.. అనూహ్యంగా వారిద్దరు 2016లో బ్రేకప్ కావటం తెలిసిందే. ఇంతకాలానికి గతంలో జరిగిన ప్రచారం నిజమన్న విషయాన్ని ఒప్పుకోవటం గమనార్హం.