Begin typing your search above and press return to search.

అమ్మ బ‌యోపిక్.. శ‌శిక‌ళ పాత్ర‌లో జాక్ పాట్

By:  Tupaki Desk   |   25 Feb 2020 2:30 AM GMT
అమ్మ బ‌యోపిక్.. శ‌శిక‌ళ పాత్ర‌లో జాక్ పాట్
X
కంగ‌న క‌థానాయిక‌గా `త‌లైవి` ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏ.ఎల్.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విష్ణు ఇందూరి నిర్మాత‌. ఇప్ప‌టికే జ‌య‌ల‌లిత కు సంబంధించి రెండు లుక్ లు రిలీజైన సంగ‌తి తెలిసిందే. నేడు అమ్మ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. కంగ‌న లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఇక ఈ చిత్రంలో కంగ‌న జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తుంటే.. ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద స్వామి .. శోభ‌న్ బాబు పాత్ర‌లో జిషు సేన్ గుప్తా న‌టిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో కీల‌క పాత్ర‌ధారి శ‌శిక‌ళ‌గా అందాల క‌థానాయిక పూర్ ఎంపికైంది. శ‌శిక‌ళ అంటే జ‌య‌ల‌లిత‌కు ఎంత క్లోజో తెలిసిందే. అమ్మ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర అది. అందుకే పూర్ణ‌కు న‌టించేందుకు ఆస్కారం ఉన్న పాత్ర అన‌డంలో సందేహం లేదు.

ఇక ఇదే చిత్రంలో ఎంజీఆర్ వైఫ్ జాన‌కి పాత్ర‌లో మ‌ధుబాల న‌టిస్తున్నారు. ఏ.ఎల్. విజ‌య్ ఈ సినిమా లో పాత్ర‌ధారుల్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం గా భావించి ఎంపిక చేసుకుంటున్నారు. ప్ర‌ధాన పాత్ర‌ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.