Begin typing your search above and press return to search.

నారాయణ అండ్ కో టీజర్ అదిరిందిగా..!

By:  Tupaki Desk   |   29 March 2023 1:41 PM GMT
నారాయణ అండ్ కో టీజర్ అదిరిందిగా..!
X
చిన్న పాపిశెట్టి డైరెక్షన్ లో యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న చిత్రం నారాయణ అండ్ కో గురించి అందరికీ తెలిసిందే. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్ లపై పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. అయితే ఇందులో అదిరిపోయే కామెడీతో అందరినీ అలరించారు.

టీజర్ లో ఆమని తన భర్తకు ప్రసాదం పెట్టగా, అతను దాన్ని నోట్లో వేసుకొని వెంటనే ఊసేస్తాడు. ఇదేం ప్రసాదమే అంటే.. మిల్లెట్స్ ప్రసాదం అని చెబుతుంది. అలాగే మనకేనా డైటు, దేవుడికి అక్కర్లేదా అంటూ భర్తకు చురకలేస్తుంది. ఆ తర్వాత హీరో, అతని తమ్ముడు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఫాస్ట్ గా చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి. అలాగే శవాలతో ఫొటోలు దిగడం.. నారాయణ అండ్ కో అంటే రిచ్చో రిచ్చో ఫ్యామిలీ అంటే సాగే పాటతో ట్రైలర్ నడుస్తుంది.

టీజర్ లో డైమండ్స్ ఉన్న పిల్లి బొమ్మ గురించి సాగే చిత్రంలా అనిపిస్తోంది. హీరోయిన్ తల్లి వివన్లస్ ముందు పైకి చూసి ఏడుస్తూ.. ఫౌండేషన్ పోతుందని చెప్పడం అందరినీ ననవ్వించేలా ఉంది.

అయితే ఈ సినిమాలో ఆమని, దేవి ప్రసాద్ ఇద్దరు అబ్బాయిల తల్లిదండ్రులుగా నటించారు. నారాయణ అండ్ కో ఒక హాస్యభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడింది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో జై కృష్ణ, పూజా కిరణ్, ఆరతి పొడి, యామిని బి ముఖ్య పాత్రలు పోషించారు.

సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అదనపు సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్స్ ఇచ్చారు. సృజన అడుసుమిల్లి ఎడిటింగ్‌ చూసుకుంటుంది. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.

సుధాకర్ కోమాకులతో పాటు దేవి ప్రసాద్, ఆమని, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్, తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సుధాకర్ కోమాకుల హీరోగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకోనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.