Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ మాదిరిగా 'నారప్ప' కూడా..!

By:  Tupaki Desk   |   25 Oct 2020 4:50 AM GMT
వకీల్‌ సాబ్‌ మాదిరిగా నారప్ప కూడా..!
X
కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఏడు నెలల క్రితం ఆగిపోయిన షూటింగ్స్‌ కు ఇప్పుడిప్పుడే క్లాప్‌ పడుతోంది. కొన్ని సినిమాలు గత నెలలో ప్రారంభం కాగా కొన్ని ఈనెలలో మొదలు అయ్యాయి. అయితే సీనియర్‌ లు ఒక్కరు ఇద్దరు స్టార్‌ హీరోలు ఇంకా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వలేదు. వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ ను ముగించేందుకు దర్శకుడు చాలా రోజులుగా పవన్‌ డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నాడు. పవన్‌ రావడం ఆలస్యం అవుతూ ఉండటంతో ఆయన లేకుండానే గత నెలలో షూటింగ్‌ ను చేశాడు. ఆయన లేని కాంబో సీన్స్‌ ను పూర్తి చేశాడు. దాంతో చాలా వరకు షూటింగ్‌ పూర్తి అయ్యింది. పవన్‌ వచ్చిన వెంటనే రెండు మూడు వారాల్లో మొత్తం షూటింగ్‌ ను పూర్తి చేయబోతున్నారు.

వకీల్‌ సాబ్‌ ఫార్ములాను నారప్పకు కూడా అప్లై చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు శ్రీకాంత్‌ సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే మొదట వెంకటేష్‌ లేని సీన్స్ ను చిత్రీకరించబోతున్నారు. ఆ సీన్స్‌ అన్ని పూర్తి అయిన తర్వాత వెంకటేష్‌ జనవరి నుండి షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. వచ్చే నెలలో నారప్పను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు. వెంకటేష్‌ మాత్రం వచ్చే ఏడాది ఆరంభం వరకు షూటింగ్‌ లో పాల్గొనేందుకు ఆసక్తిగా లేరు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా మరో వైపు దర్శకుడు శ్రీకాంత్‌ చేయిస్తున్నాడు. వెంకీ 'నారప్ప' సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.