నారప్ప థియేటర్ కి వచ్చేస్తున్నాడహో..!

Tue Dec 06 2022 21:23:17 GMT+0530 (India Standard Time)

Narappa Movie To Release in Theatres

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన రీమేక్ మూవీ నారప్ప. కోలీవుడ్ లో ధనుష్ చేసిన అసురన్ ని యాజిటీజ్ దించేశారు శ్రీకాంత్ అడ్డాల. కరోనా లాక్ డౌన్ టైం లో తప్పనిసరి పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ లో నారప్ప రిలీజ్ చేశారు. వెంకటేష్ నుంచి ఇలాంటి మాస్ సినిమా వచ్చి చాలా రోజులైంది అందుకే అసురన్ ని కాపీ పేస్ట్ చేసినా నారప్ప సక్సెస్ అయ్యింది.నారప్పని థియేటర్ లో చూడాలని దగ్గుబాటి ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుతున్నారు. ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. నారప్ప సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. అయితే అది కూడా ఒక్కరోజు మాత్రమే.

ఈమధ్య స్టార్ సినిమాలన్ని రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నారప్ప థియేట్రికల్ వర్షన్ ని ఫ్యాన్స్ కి వెంకటేష్ బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. నారప్ప థియేట్రికల్ రిలీజ్ ఆ ఒక్కరోజు మాత్రమే.. ప్రేక్షకుల డిమాండ్ ని బట్టి అది ఒక్క షోనా.. రెండా.. నాలుగు ఆటలు అన్నది నిర్ణయిస్తారు. అసలైతే వెంకటేష్ బర్త్ డే సందర్భంగా బొబ్బిలి రాజా జయం మనదేరా సినిమాలు రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ నారప్ప అయితే థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ బాగుంటుందని అలా ఫిక్స్ అయ్యారు.

ఎఫ్ 3 సినిమాలో చివర్లో కొద్ది నిమిషాల పాటు నారప్ప గెటప్ లో వెంకటేష్ అలరిస్తారు. ఆ ఎపిసోడ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి నారప్ప రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు సురేష్ బాబు. ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఒకటి రెండు కథలను వింటున్న వెంకీ బాలీవుడ్ లో సల్మాన్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో సినిమా కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్నా అది ఫైనల్ అవలేదు.

రీసెంట్ గా విశ్వక్ సేన్ ఓరి దేవుడా మూవీలో నటించాడు వెంకటేష్. అయితే అది చాలా చిన్న పాత్ర అవడం వల్ల దగ్గుబాటి ఫ్యాన్స్ కి పెద్దగా నచ్చలేదు.

ఈతరం హీరోల్లో మల్టీస్టారర్ అంటే గుర్తొచ్చేది వెంకటేష్ మాత్రమే.. అయితే వెంకీ మామ కూడా ఈమధ్య రొటీన్ సినిమాలు చేస్తున్నాడని.. ఆయన్ని ఒక సీరియస్ పాత్రలో చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీ 75వ సినిమా క్రేజీ కాంబినేషన్ లో వస్తుందని అంటున్నారు. అది ఎవరితో అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.