తాగి బిగ్ బాస్ లోకి వచ్చింది.. నటిపై కమెడియన్ ఫైర్

Thu Jul 16 2020 06:00:12 GMT+0530 (IST)

Came into Bigg Boss after drink .. Comedian fire on the actress

బిగ్ బాస్ తో ఫేమస్ అయిన నటి వనితా విజయ్ కుమార్ ఇటీవలే మూడో పెళ్లి చేసుకుంది. అయితే ఇన్ని పెళ్లిల్లు చేసుకుంటూ భర్తలను వదిలేస్తున్న ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జులై 14న తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెన్నైలోని పోరూర్ పోలీస్ స్టేషన్ లో వనితా విజయ్ కుమార్ ఫిర్యాదు చేసింది. కమెడియన్ నాంజిల్ విజయన్ కామెంట్ చేశారని ఆరోపించింది.ఈ సందర్భంగా కమెడియన్ నాంజిల్ విజయన్ నిప్పులు చెరిగారు. వనితా విజయ్ కుమార్ తనకు అక్రమ సంబంధాలు అంటకట్టిందని.. నాకు ఎలాంటి సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. టిక్ టాక్ యూట్యూబ్ లో వీడియోలు పెడితే సంబంధం అంటకడుతారా అని ప్రశ్నించారు.

వనితా విజయ్ కుమార్ మహిళ అనే కారణంతో వదిలేస్తున్నానని.. ఆమె నన్ను టార్గెట్ చేయడం చూస్తే ఆమె వీడియోలు తన వద్ద చాలా ఉన్నాయని కమెడియన్ నాంజిల్ విజయన్ ఆరోపించారు.ఆమె బిగ్ బాస్ లోకి రెండోసారి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కార్వాన్ లో ఫుల్లుగా తాగి ప్రవేశించిందని.. అది అందరికీ తెలుసు అని బాంబు పేల్చాడు. నేను సెలెబ్రెటీ అంటూ ఇతరులపై ఆరోపణలు చేసేటప్పుడు తన వ్యవహారం ముందు సరిదిద్దుకోవాలని నాంజిల్ హితవు పలికారు.