Begin typing your search above and press return to search.

జక్కన్న ను భలే వాడేస్తున్నాడుగా

By:  Tupaki Desk   |   25 Feb 2020 2:30 AM GMT
జక్కన్న ను భలే వాడేస్తున్నాడుగా
X
కొంత మంది హీరోలు వారి సినిమాల ప్రమోషన్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నాని ది అలాంటి ప్లానింగ్ తోనే తను నిర్మించిన సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ అనే ఓ కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'HIT'సినిమాను నిర్మించాడు నాని. ఈ సినిమా ప్రమోషన్ ను మొన్నటి వరకూ లైట్ తీసుకున్న నేచురల్ స్టార్ సరిగ్గా రిలీజ్ కి ముందు తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఓ బజ్ క్రియేట్ చేసి హైప్ తీసుకొచ్చాడు.

అవును తన సినిమా బజ్ కోసం తన ఫేవరేట్ డైరెక్టర్ జక్కన్న ను మరోసారి వాడేసాడు నాని. రాజమౌళి ఫ్యామిలీ తో ఉన్న బాండింగ్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జక్కన్న ను ఇన్వైట్ చేసాడు. జక్కన్న నే లాదు అనుష్క ని కూడా ఈవెంట్ కి పిలిచి అందరి సృష్టి తన సినిమావైపుకి మళ్ళించాడు. ఇక నాని మీద ప్రేమతో జక్కన్న కూడా సినిమా గురించి నాలుగు మాటలు చెప్పి హైప్ తెచ్చే ప్రయత్నం చేసాడు.

ఇలా ఓ వారం ముందు జక్కన్న ను బరిలోకి దింపి సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసుకున్నాడు నాని. అయితే జక్కన్న ను నాని ఇలా వాడటం ఇదేం కొత్త కాదు. తన మజ్ను సినిమాలో కూడా జక్కన్న తో ఓ గెస్ట్ రోల్ చేయించుకున్నాడు. రెండు సినిమాల ఫంక్షన్స్ కి కూడా స్పెషల్ గెస్ట్ పిలిచి ఆయన్ను సరిగ్గా వాడుకున్నాడు. అదే రీతిలో తన ప్రొడక్షన్ సినిమా కోసం మరోసారి జక్కన్న ఇమేజ్ ను వాడేశాడు నేచురల్ స్టార్.