ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాని

Mon Nov 29 2021 08:59:06 GMT+0530 (IST)

Nani kept her word to the fans

అభిమానులు తన కోసం ఏదైనా చేయడం కాదు .. తానే అభిమానుల కోసం ఏదైనా చేస్తానని అన్నారు నాని. నేచురల్ స్టార్ నాని తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రాక్టికల్ గా అన్నదానిని చేసి చూపించారు. లేటెస్ట్ గా నాని హైదరాబాద్ లో అభిమానుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి 4000 మంది అభిమానులు హాజరయ్యారు.వారికి రుచికరమైన ఆహారాన్ని అందించారు. నాని స్వయంగా కొందరికి భోజనం వడ్డించగా పలువురితో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారందరికీ ఓపికగా ఫోటోలకు ఫోజులిచ్చి శ్యామ్ సింఘరాయ్ జ్ఞాపికలతో కూడిన బ్యాగును బహుకరించారు. నాని స్వయంగా సంతకం చేసిన శ్యామ్ సింగరాయ్ బ్యాగ్ లను ఇవ్వడం తీపి జ్ఞాపకంగా భావించారు ఫ్యాన్స్.

నాని చెప్పిందే చేశారు..! అంటూ అభిమానులు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఇప్పుడు రిలీజ్ కి రాబోతున్న శ్యామ్ సింగరాయ్ కి బోలెడంత ప్రచారం దక్కింది. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నాని బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టే వైవిధ్యంగా ప్రచార కార్యక్రమాల్ని ప్లాన్ చేస్తున్నారు.

నాని-కృతిశెట్టి- సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. పీరియాడిక్ టచ్ వున్న ఈ మూవీని `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కొంత భాగం పురాతన కోట నేపథ్యంలో తెరకెక్కింది. మూవీ నేపథ్యంలో.. నాని క్యారెక్టర్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలవనుంది. సాయి పల్లవి పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని గుసగుస వినిపిస్తోంది. 24 డిసెంబర్ ఈ చిత్రం విడుదల కానుంది.