అవసరాలకు ఓకే చెప్పిన నాచురల్ స్టార్

Tue Oct 27 2020 13:20:54 GMT+0530 (IST)

Nani casting in Avasarala Srinivas direction

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ వెంటనే రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాలోనూ నాని నటించాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా నాని ఇతర సినిమాలకు కూడా ఓకే చెప్పాడు. నటుడిగా దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాని ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట. ఈ లాక్ డౌన్ టైం లో వీరిద్దరు కలిసి కథ చర్చల్లో పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన కథ చర్చలు ఒక కొలిక్కి వచ్చి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది.సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం నాగశౌర్య హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాని ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు కూడా అప్పటి వరకు పూర్తి అవ్వనున్నాయి. దాంతో నాని.. అవసరాల శ్రీనివాస్ ల కాంబో మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కే అవకాశం కనిపిస్తుంది.